Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికి వెళ్తూ హై హీల్స్ వేసుకుంది.. అంతే కన్నబిడ్డను కోల్పోయింది..

ఫ్యాషన్ పేరిట వస్త్రధారణ మోజు మహిళల్లో అధికమైంది. ఇంటికే పరిమితమైన మహిళలైనా, ఉద్యోగినులైనా తమను అందంగా చూపెట్టుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా ఓ మహిళ పెళ్లికి వెళ్తూ వెళ్తూ అందంగా ముస్తాబై హీల

Webdunia
మంగళవారం, 8 మే 2018 (15:10 IST)
ఫ్యాషన్ పేరిట వస్త్రధారణ మోజు మహిళల్లో అధికమైంది. ఇంటికే పరిమితమైన మహిళలైనా, ఉద్యోగినులైనా తమను అందంగా చూపెట్టుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా ఓ మహిళ పెళ్లికి వెళ్తూ వెళ్తూ అందంగా ముస్తాబై హీల్స్ వేసుకుంది. అయితే హీల్స్ పుణ్యంతో కాలు జారిపడింది. అంతే కన్నబిడ్డను పోగొట్టుకుంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని థానే ప్రాంతంలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. థానేకు చెందిన ఫెహ్మిదా షేక్‌ అనే మహిళ తన భర్త, ఆరు నెలల బిడ్డతో కలిసి ఓ వివాహ వేడుకకు హాజరైంది. పెళ్లికావడంతో అందంగా ముస్తాబైన ఫెహ్మిదా.. హై హీల్స్ ధరించింది. వివాహ వేడుక ముగిసిన తర్వాత ఫంక్షన్ హాలులో తొలి అంతస్తు వద్ద ఫెహ్మిదా వేసుకున్న హీల్స్‌ అదుపు తప్పడంతో ఆమె చేతిలోని బిడ్డ మొదటి అంతస్తు నుంచి కిందపడిపోయాడు.
 
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి రక్తపుమడుగులో కనిపించిన చిన్నారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే బిడ్డ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఆ తల్లి పడిన ఆవేదన అక్కడివారిని కలిచివేసింది.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments