శోభనం గదిలో భార్య హత్య... భర్త ఆత్మహత్య.. ఎక్కడ?

Webdunia
గురువారం, 11 జూన్ 2020 (21:29 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఓ విషాదకర సంఘటన జరిగింది. శోభనం గదిలో భార్య హత్యకు గురికాగా, భర్త ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా మీంజూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మీంజూరుకు చెందిన నీతావాసన్ ‌(24), సంధ్య(20) అనే యువతీ యువకులు సమీప బంధువులు. వీరికి వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు. దీంతో బుధవారం ఉదయం వీరికి వివాహం జరిగింది. 
 
అదే రోజు రాత్రి ఈ నూతన దంపతులకు శోభనం ఏర్పాటు చేశారు. ఎన్నో ఆశలతో ఆమె శోభనం గదిలోకి అడుగుపెట్టింది. సుఖ, సంతోషాలతో గడపాల్సిన ఆ సమయంలో.. భార్యతో భర్త గొడవ పెట్టుకున్నాడు. తొలిరాత్రి గదిలో దంపతుల మధ్య తలెత్తిన వివాదం హత్య దాకా దారితీసింది. 
 
ఆవేశంలో భార్యను గునపంతో పొడిచి చంపాడు భర్త. అనంతరం ఇంటికి సమీపంలోని చెట్టుకు భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నూతన దంపతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి

Director Vasishta, : జంతువుల ఆత్మతోనూ కథ తో నెపోలియన్ రిటర్న్స్

Vishnu: విష్ణు విశాల్... ఆర్యన్ నుంచి లవ్లీ మెలోడీ పరిచయమే సాంగ్

Gopichand: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్

నారా రోహిత్, శిరీష ప్రీ - వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం.. పెళ్లి ముహూర్తం ఎప్పుడంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments