Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ స్కూల్‌కు సీఎం స్టాలిన్ సడెన్ ఎంట్రీ...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (13:20 IST)
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైనశైలిలో పాలన సాగిస్తూ, ప్రతి ఒక్కరి ప్రశంసలు, మన్నలు పొందుతున్నారు. ముఖ్యంగా, రాష్ట్ర ప్రజలు ఆయనను అభినందిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ ప్రభుత్వ పాఠశాలలో సడెన్ ఎంట్రీ ఇచ్చి ప్రతి ఒక్కరికీ షాకింగ్‌కు గురిచేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల్ని, విద్యార్ధుల్ని ఆప్యాయంగా పలకరించారు. మధ్యాహ్నా భోజనాలు వండే ప్రాంతాన్ని పరిశీలించారు. 
 
బుధవారం సీఎం స్టాలిన్ ప్రభుత్వం స్కూళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా సీఎం స్వయంగా విద్యార్ధులతో మాట్లాడారు. ఎలా చదువుకుంటున్నారు? ఇక్కడ ఎటువంటి సౌకర్యాలున్నాయి? మీకు అన్ని సక్రమంగా అందుతున్నాయా? అని ప్రశ్నించారు.
 
చెంగల్పట్టు జిల్లా కడపాక్కం పి.కృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సీఎం తనిఖీ నిర్వహించారు. విల్లుపురం జిల్లా ముదలియార్‌కుప్పంలో ‘ఇంటి వద్దకే విద్య’ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా సీఎం స్టాలిన్‌ కారులో వెళుతూ మార్గమధ్యంలో కడపాక్కం వద్ద ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి అక్కడి పరిస్థితుల్ని సమీక్షించారు. 
 
సీఎంను చూసిన విద్యార్ధులు సంతోషపడిపోయారు. తాము సీఎంను కలుస్తామని అస్సలు అనుకోలేదని.. కానీ సీఎం సడెన్‌గా మా స్కూల్లో ప్రత్యక్షమయ్యేసరికి అంతా కలలా ఉందని ఊహించని అతిథి కళ్లముందే కనిపించటంతో పట్టరాని సంతోషంగా ఉందని విద్యార్థు సంతోషం వ్యక్తంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

నా ఆఫీసులో ప్రతి గోడ మీద హిచ్‌కాక్‌ గుర్తులు ఉన్నాయి : దర్శకులు వంశీ

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ సెకండ్ షెడ్యూల్

Balagam Actor: బలగం నటుడు మొగిలయ్య కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments