Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాంధుడి నుంచి ఆమెను కాపాడబోయి ప్రాణాలు వదిలిన బావ.. ఎక్కడ?

ఓ కామాంధుడి నుంచి ఆమెను రక్షించబోయి బావ ప్రాణాలు కోల్పోయాడు. మామ మాత్రం తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా మంగళం వీపీ

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (09:28 IST)
ఓ కామాంధుడి నుంచి ఆమెను రక్షించబోయి బావ ప్రాణాలు కోల్పోయాడు. మామ మాత్రం తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా మంగళం వీపీ కుప్పానికి చెందిన రైతు ఏళుమలై. ఈయనకు కుమార్‌ (43), సెల్వం (40) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యం కారణంగా రెండేళ్ల క్రితం రెండో కుమారుడు సెల్వం మృతి చెందాడు. దీంతో అతని భార్య అంజలి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటిగా జీవిస్తోంది. 
 
అయితే, కూత్తాండవర్‌ పురానికి చెందిన కార్తికేయన్ అనే బంధువు ఆమెపై కన్నేసి, లైంగికంగా వేధించసాగాడు. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం సేవించి అంజలి ఇంటికి వచ్చిన కార్తికేయన్ ఆమెతో గొడవ పడ్డాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న అంజలి మామ, బావలు అక్కడికి చేరుకుని కార్తికేయన్‌ను అడ్డుకునేందుకు యత్నించారు. అయితే, మద్యం సేవించివున్న కార్తికేయన్.. తీవ్ర కోపోద్రేకానికిలోనై.. ఇంట్లో ఉన్న మారణాయుధంతో అతనిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కుమార్‌ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, అతని తండ్రి ఆస్పత్రి పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కుమార్‌ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం