బిర్యానీలో లెగ్‌పీస్ లేదనీ చేతివేళ్లు నరికేశారు.. ఎక్కడ?

ఇటీవలికాలంలో దారుణాలు లెక్కకుమించి జరిగిపోతున్నాయి. చిన్న విషయానికి సైతం ఆవేశంతో రగిలిపోతున్నారు. ఫలితంగా చేయరాని తప్పులు చేస్తూ జైలుపాలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి చికెన్ బిర్యానీలో లెగ్‌పీస్ లేకపోవడ

Webdunia
గురువారం, 14 జూన్ 2018 (15:08 IST)
ఇటీవలికాలంలో దారుణాలు లెక్కకుమించి జరిగిపోతున్నాయి. చిన్న విషయానికి సైతం ఆవేశంతో రగిలిపోతున్నారు. ఫలితంగా చేయరాని తప్పులు చేస్తూ జైలుపాలవుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి చికెన్ బిర్యానీలో లెగ్‌పీస్ లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతివేళ్లు నరికేశాడు. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లా సుద్దమల్లి వద్ద జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాలోని సుద్దమల్లి ప్రాంతంలో జాకీర్‌ హుస్సేన్‌ - భాను అనే దంపతులు బిర్యానీ హోట‌ల్‌ నడుపుతున్నారు. మద్యం సేవించిన ఏడుగురు వ్యక్తులు ఈ హోటల్‌కు వచ్చి, బిర్యానీకి ఆర్డర్ ఇచ్చారు. వీరందరికీ సర్వర్ బిర్యానీ సఫరా చేశాడు. అయితే, సరఫరా చేసిన బిర్యానీలో లెగ్‌పీస్‌ లేదని ఆగ్రహించిన వారు జాకీర్‌ హుస్సేన్‌ - భాను దంపతులతో వాగ్వాదానికి దిగారు. 
 
ఈ గొడవ పెరగడంతో మద్యం మత్తులో ఉన్న రౌడీలు తమ వద్ద ఉన్న కత్తులతో దంపతులపై దాడిచేసి, చేతి వేళ్లు నరికేశారు. ఇరుగుపొరుగు వాళ్లు రావడంతో రౌడీలు అక్కడి నుంచి పరారయ్యారు. దంపతుల ఫిర్యాదుతో తిరునల్వేలి పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. సుద్దమల్లికి చెందిన శబరి (27), సుడలైముత్తు (26) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పరారైనవారి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Boman Irani: రాజా సాబ్ నుంచి బొమన్ ఇరానీ బర్త్ డే పోస్టర్

బాలకృష్ణ 'అఖండ-2'కు టిక్కెట్ ధరలు పెంపు

రాగ్ మయూర్, మెరిన్ ఫిలిప్ జంటగా అనుమాన పక్షి

వార్నింగ్ ఇచ్చే G.O.A.T సినిమా తీసుకున్నా : మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి

Samyukta: ప్రాక్టీస్ తర్వాత మోకాలు నొప్పి తో ఫిజియోథెరపీ తీసుకున్నా : సంయుక్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments