Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ ఆరోగ్యం భేష్.. ప్రత్యేక వార్డుకు తరలింపు.. ఇక అమ్మ ఇష్ట ప్రకారమే డిశ్చార్జ్..

తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం కుదుటపడింది. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత గత 58 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెను అపోలో వైద్యులు ఎంసీసీయూ నుంచి ప్రత్యేక వార్డు

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (19:14 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం కుదుటపడింది. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత గత 58 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమెను అపోలో వైద్యులు ఎంసీసీయూ నుంచి ప్రత్యేక వార్డుకు శనివారం తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం వందశాతం కుదుటపడిందని అపోలో ఆసుపత్రి గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి అన్నారు.
 
శుక్రవారం ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జయలలిత చాలా రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆమెకు సోకిన ఇన్ ఫెక్షన్ పూర్తిగా నయమైందని తెలిపారు. జయలలితకు ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుందని భావించి తాము ఐసీయూలోనే పెట్టామని తెలిపారు. జయలలిత ఎప్పటిలాగే అందరితో మాట్లాడుతున్నారని, ఆమె తన శ్రేయోభిలాషులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారని అపోలో చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి అన్నారు. ప్రస్తుతం జయలలిత విశ్రాంతి మాత్రం తీసుకుంటున్నారని వెల్లడించిన సంగతి తెలిసిందే. 
 
అయితే డిశ్చార్జ్ అయ్యే విషయంపై జయలలితనే నిర్ణయం తీసుకుంటారని, ఆమె ఇష్ట ప్రకారమే డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం చేశారు. అయితే అమ్మ పూర్తిగా కోలుకున్నారని వార్త వినగానే అన్నాడీఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments