Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్లు కట్టలేదని బెడ్‌కే కట్టేశారు, మధ్యప్రదేశ్ ఆసుపత్రిలో దారుణం

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (09:33 IST)
ప్రైవేటు ఆసుపత్రుల అఘాయిత్యం మరోమారు బట్టబయలైంది. ఫీజుల కోసం ఎంతకైనా దిగజారే కొన్ని ఆసుపత్రుల రాక్షసత్వం బాహ్య ప్రపంచానికి మరొక్కమారు తెలిసొచ్చింది.
 
చికిత్స అనంతరం బిల్లు చెల్లించలేదని ఒక వృద్ధుడిని వైద్యులు బెడ్‌కు కట్టేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజ్‌పూర్‌ జిల్లాలో జరిగింది. రూ. 11వేలు చెల్లించకపోవడంతో అతని కాళ్లు, చేతులు కట్టేశారని వృద్ధుని కుమార్తె తెలిపింది.

ఆస్పత్రిలో అడ్మిట్‌ అయినపుడు రూ. 5 వేలు బిల్లు చెల్లించామని, అయితే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మరికొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిందని, దీంతో బిల్లు ఎక్కువైందని, అంత డబ్బు చెల్లించలేమని చెప్పామని ఆమె పేర్కొంది.

మొత్తం నగదు చెల్లించాల్సిందేనంటూ వైద్యులు వృద్ధుడిని మంచానికి కట్టేశారని వాపోయింది. అయితే వృద్ధునికి మూర్చ ఉన్నందునే ఆ విధంగా మంచానికి కట్టేశామంటూ ఆస్పత్రి వర్గాలు వెల్లడించడం గమనార్హం.

ఈ ఘటనపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. షాజ్‌పూర్‌లో ఉన్న ఆస్పత్రి వర్గాలపై కఠిన చర్యలు తీసుకుంటామని, దర్యాప్తుకు ఆదేశించామని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments