Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెట్వర్క్ హాస్పిటల్స్ లో వైద్య సేవలు ప్రారంభం

Advertiesment
Medical Services
, మంగళవారం, 5 మే 2020 (16:10 IST)
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ లో అత్యవసర వైద్య సేవలతో పాటు సాధారణ అవుట్ పేషెంట్ కు సంబంధించిన వైద్య సేవలను ప్రారంభించినట్లు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, సాయి భాస్కర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ బూసి రెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరోగ్యశ్రీ, ఇ హెచ్ ఎస్ కింద వైద్య సేవలను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక అరండల్ పేట లోని సాయి భాస్కర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఎప్పుడు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరుణ విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ సమయంలో కేవలం అత్యవసర వైద్య సేవలను మాత్రమే అందిస్తూ వచ్చామని ఇకపై సాధారణ ఔట్ పేషెంట్ ఈ విభాగానికి సంబంధించి వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ op సేవలు నెట్వర్క్  హాస్పిటల్స్ లో అందుబాటులోకి తెచ్చామని  పేర్కొన్నారు. ఆయా హాస్పిటల్స్ కు వచ్చే రోగులు తప్పనిసరిగా తాము ఏ ప్రాంతం నుంచి వస్తున్నది( ఏ జోన్) తెలియజేయాలని స్పష్టం చేశారు. కరోనా  లక్షణాలతో బాధ పడేవారు ముందుగా తెలియజెప్పాలని సూచించారు.

వ్యాధులతో బాధపడే వారి వెంట ఒక్కరు మాత్రమే రావాలని సూచించారు. తప్పనిసరిగా మాస్కు ధరించి రావాలని పేర్కొన్నారు. ఇన్ పేషెంట్ గా ఉండే వారి వద్దకు విజిటర్స్ ను అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఆయా ఆస్పత్రులకు వచ్చే రోగులు భౌతిక దూరం పాటించేందుకు వీలుగా సౌకర్యాలను కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఆసుపత్రులకు వచ్చే వారు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నారు. దీంతో తమ చుట్టుపక్కల కరోనా  వ్యాధిగ్రస్తులు సమాచారాన్ని తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని తద్వారా జాగ్రత్త పడేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. ఆస్పత్రులలో చెల్లించే ఫీజులు దాదాపు డిజిటల్ చెల్లింపులుకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 

డాక్టర్లు వైద్య సిబ్బంది సైతం రక్షణాత్మక మైన నిబంధనలు పాటించాలని సూచించారు. N 95 మాస్క్  తో పాటు, చేతికి గ్లౌజులు, మొఖానికి షీల్డ్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ప్రభుత్వం వైద్యులకు సిబ్బందికి రూ 50 లక్షల భీమా కనిపిస్తున్న నేపథ్యంలో తప్పనిసరిగా ఆసుపత్రుల యాజమాన్యాలు వైద్యులు, ఇన్సూరెన్స్ చేయించుకోవాలని డాక్టర్ నరేందర్ రెడ్డి సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయవాడలో ఎటువంటి సడలిపులు లేవు: కృష్ణా కలెక్టర్