Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరిని వేధిస్తున్నాడని.. చేయి నరికి ఎత్తుకెళ్ళిపోయిన అన్నదమ్ములు.. ఎక్కడంటే?

మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వివాహిత అయినప్పటికీ తన సోదరిని తరచూ వేధిస్తున్నాడని ముగ్గురు సోదరులు కలసి ఓ వ్యక్తి చేయిని నరికేసిన ఘటన గోరఖ్‌పూర్‌లోని సింధులీ బింద

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (15:42 IST)
మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా వివాహిత అయినప్పటికీ తన సోదరిని తరచూ వేధిస్తున్నాడని ముగ్గురు సోదరులు కలసి ఓ వ్యక్తి చేయిని నరికేసిన ఘటన గోరఖ్‌పూర్‌లోని సింధులీ బిందులీ అనే గ్రామంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే రాజ్‌మన్‌ అనే వ్యక్తి ఓ యువతి కిడ్నాప్ కేసులో జైలుకు వెళ్ళొచ్చాడు. మహిళలపై ఎప్పటికీ ఓ కన్నేసి వుంచి వారిని ఎలాగైనా వారిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించేవాడు. అలా కుదరకపోతే.. కిడ్నాప్ చేసేవాడు. ఈ క్రమంలో జైలుకెళ్ళి వచ్చినా అతడి బుద్ధి మాత్రం మారనే లేదు. 
 
జైలునుంచి వచ్చాక కూడా పెళ్లి అయిపోయిన ఆ యువతిని ఫోన్‌ ద్వారా వేధిస్తూనే ఉండేవాడు. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న బాధితురాలి ముగ్గురు సోదరులు.. రాజ్‌మన్‌పై పగ తీర్చుకునేందుకు రెడీ అయిపోయారు. 
 
సోమవారం రాజ్‌మన్‌ కాలువగట్టు దగ్గర ఉండగా ద్విచక్ర వాహనంపై అక్కడికి వెళ్లిన ముగ్గురు అతడిపై దాడి చేశారు. చేయిని నరికేశారు. దాన్ని తమ వద్దే ఉంచుకున్నారు. అతడిని రక్తపు మడుగులో వదిలేసి పరారైనారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆపరేషన్ సిందూర్ ఆపలేదు.. కొనసాగుతుంది : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం