Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మోకింగ్‌కు భారీ ఖర్చు.. ఏడాదికి ఒక ట్రిలియన్ డాలర్లు.. నియంత్రణకు ఏం చేయాలంటే?

ధూమపాన వాడకం బాగా పెరిగిపోతోంది. స్మోకింగ్ ద్వారా ఆరోగ్యంతో పాటు డబ్బెంతో నష్టపోతున్న సంగతి తెలిస్తే షాక్ తినాల్సిందే. ధూమపాన ఖర్చుపై గ్లోబల్ ఎకానమీపై ఎంత భారం పడుతుందో తెలుపుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజే

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (15:20 IST)
ధూమపాన వాడకం బాగా పెరిగిపోతోంది. స్మోకింగ్ ద్వారా ఆరోగ్యంతో పాటు డబ్బెంతో నష్టపోతున్న సంగతి తెలిస్తే షాక్ తినాల్సిందే. ధూమపాన ఖర్చుపై గ్లోబల్ ఎకానమీపై ఎంత భారం పడుతుందో తెలుపుతూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ), యూఎస్ నేషనల్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్(ఎన్ఎస్ఏ)లు షాకింగ్ విషయాలను వెల్లడించాయి. ప్రతి ఏడాదికి ధూమపాన ఖర్చు 1 ట్రిలియన్ డాలర్లని చెప్పాయి. భారత కరెన్సీలో ఇది ఇంచుమించు రూ.68,04,250కోట్లు. అలాగే స్మోకింగ్ ద్వారా ప్రస్తుతం మరణిస్తున్న సంఖ్య 2030 వరకు మూడింతలు పెరుగుతూనే ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్ ఇచ్చింది. 
 
ధూమపానంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించిన ఖర్చు, పొగాకు పన్ను రూపంలో అంతర్జాతీయంగా వస్తున్న రెవెన్యూల కంటే ఎక్కువగా ఉందని తెలిసింది. ప్రస్తుతం ఏడాదికి 60 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని, 2030 నాటికి ఈ మరణాలు 80 లక్షలకు పెరుగుతాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. పొగాకు పన్నుల పెంపు, ధరల పెంపు, ధూమపాన రహిత పాలసీలు, పొగాకు కంపెనీల మార్కెటింగ్ నూ పూర్తిగా నిషేధం విధించడం వంటి వాటివల్ల స్మోకింగ్‌ను నిరోధించవచ్చని డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ద్వారా సూచనలు చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments