Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంచు పర్వతంపై 40 ఏళ్ల పాటు ఒంటరి జీవితం.. దెయ్యాల ఊరులో టెంట్ వేసుకుని..?

ఒంటరి జీవితం ఎంత నరకమో అందరికీ బాగా తెలుసు. తోడు లేకుండా ఒంటరిగా జీవించేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ ఓ వ్యక్తి మంచు పర్వతం, దెయ్యాల ఊరుగా పేరున్న ప్రాంతంలో 40 సంవత్సరాలుగా జీవిస్తున్నాడు. ప్రకృతితో ఆ ప్ర

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (15:11 IST)
ఒంటరి జీవితం ఎంత నరకమో అందరికీ బాగా తెలుసు. తోడు లేకుండా ఒంటరిగా జీవించేందుకు ఎవరూ ఇష్టపడరు. కానీ ఓ వ్యక్తి మంచు పర్వతం, దెయ్యాల ఊరుగా పేరున్న ప్రాంతంలో 40 సంవత్సరాలుగా జీవిస్తున్నాడు. ప్రకృతితో ఆ ప్రాంతంలో స్నేహం ఏర్పరుచుకున్నాడు. అక్కడ గల ప్రకృతి ప్రాంతాల్లో ఆ వ్యక్తి తీసిన వీడియోలు ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ పరిస్తితులను అద్దం పట్టే పరిశోధనలకు ఉపయోగకరంగా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. న్యూజెర్సీకి చెందిన 60ఏళ్ల బిల్లీ బర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ చదివాడు. 1972లో వాటర్‌ కెమిస్ట్రీ పరిశోధన నిమిత్తం రాకీ మంచు పర్వత ప్రాంతం కొలరొడోలోని గొతిక్‌ పట్టణానికి వెళ్లాడు. 1920 నాటి నుంచి ఆ పట్టణంలో జనసంచారం లేదు. ఇంకా చెప్పాలంటే.. దానికి దెయ్యాల ఊరనే పేరు కూడా ఉంది. కానీ బిల్లీ గ్రూప్ పరిశోధనలు చేసి తిరిగి వచ్చేసింది. అయితే బిల్లీకి ఆ పట్టణం బాగా నచ్చేసింది. ఇక అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. 
 
మంచు పర్వతంపై చిన్న టెంట్ వేసుకుని.. ఎముకల్ని కొరికే చలిలో ఉండిపోయాడు. సమీపంలోని పట్టణంలో సరుకులు తెచ్చుకుని.. బోర్ కొట్టినప్పుడల్లా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఫోటోలను కెమెరాలో బంధించేవాడు. ఎంత దట్టంగా మంచు కురుస్తోంది. ఉష్ణోగ్రత.. మంచు సాంద్రత.. ఇలా ప్రకృతిలోని ప్రతీ విషయాన్ని 40ఏళ్లుగా వీడియో తీస్తూ వస్తున్నాడు. అయితే బిల్లీ తీసిన వీడియో ప్రస్తుతం గ్లోబల్‌ వార్మింగ్‌ పరిశోధనలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ప్రస్తుతం బిల్లీ తీసిన వీడియోల ఆధారంగా షార్ట్ ఫిల్మ్ కూడా రూపుదిద్దుకోనుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments