Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈసీని కాదు.. నన్ను శిక్షించండి.. రాజీవ్ కుమార్ అఫిడవిట్

Webdunia
శనివారం, 8 మే 2021 (18:21 IST)
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తికి ప్రధాన కారణంగా కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలే ప్రధాన కారణమనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, ఈసీ వ్యవహారశైలిని అనేక రాష్ట్రాల హైకోర్టులు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి ఈసీనే కారణమని, ఈసీ అధికారులపై హత్యా నేరం నమోదు చేసినా తప్పులేదని మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. అదేసమయంలో ఇతర హైకోర్టులు వేస్తున్న మొట్టికాయలతో ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇచ్చుకుంటున్నారు. 
 
ఈ విమ‌ర్శ‌ల‌పై ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ రాజీవ్ కుమార్ స్పందించారు. మ‌ద్రాస్ హైకోర్టుకు స‌మ‌ర్పించే అఫిడ‌విట్‌లో ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. నిజానికి కొన్ని ద‌శ‌ల ఎన్నిక‌ల‌ను వాయిదా వేద్దామ‌ని అనుకున్నాం. కానీ రాష్ట్ర‌ప‌తి పాల‌న పెడితే అది ఎన్నిక‌ల సంఘంపై విమ‌ర్శ‌ల‌కు తావిచ్చిన‌ట్లు అవుతుంది. 
 
ఒక పార్టీకి అనుకూలంగా, మ‌రో పార్టీకి వ్య‌తిరేకంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తాయి. అందుకే అలాగే ఎన్నిక‌లు నిర్వ‌హించాం అని రాజీవ్ కుమార్ వెల్ల‌డించారు. అయితే ఈ అఫిడ‌విట్‌ను ఎన్నిక‌ల సంఘం తిరస్క‌రించ‌డంతో దీనిని మద్రాస్ హైకోర్టులో దాఖ‌లు చేయ‌లేదు.
 
ప‌శ్చిమ బెంగాల్‌లో మిగ‌తా ద‌శ‌ల పోలింగ్‌ను క‌లిపేద్దామ‌న్న ఆలోచ‌న కూడా ఎన్నిక‌ల సంఘం చేసిన‌ట్లు రాజీవ్‌కుమార్ చెప్పారు. అయితే ప్ర‌జాప్రాతినిధ్య చ‌ట్టం సెక్ష‌న్ 30 ప్ర‌కారం ఒక్కో ఎన్నిక‌ల దశ ప్ర‌త్యేక‌మైన‌ది, ఒక్కోదానికి ఒక్కో నోటిఫికేష‌న్ వేయాల్సిందేన‌ని స్ప‌ష్టం చేస్తోంది అని ఆయ‌న చెప్పారు. 
 
అయితే ఏడు, ఎనిమిది ద‌శ‌ల‌ను చ‌ట్ట‌ప‌రంగా క‌లిపే వీలు ఉన్న‌ద‌ని, వీటికి నోటిఫికేష‌న్ ఒక‌టే కాబ‌ట్టి.. ఏప్రిల్ 26, 29 మ‌ధ్య ప్ర‌చారం జ‌ర‌గ‌కుండా చూసుకున్న‌ట్లు చెప్పారు. కానీ, ఆ స‌మ‌యంలో ప్ర‌చారం ముగించాల్సిన‌ స‌మ‌యాన్ని 48 గంట‌ల నుంచి 72 గంట‌ల‌కు పెంచారు. 
 
తాను రాజీనామా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని, వ్య‌క్తిగ‌తం శిక్షించినా త‌న‌కు స‌మ్మ‌త‌మేన‌ని రాజీవ్ కుమార్ చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎన్నిక‌ల సంఘంపై మ‌ద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు తీవ్రంగా నిరుత్సాహ‌ప‌రిచాయ‌ని ఆయ‌న చెప్పారు.
 
ఈ విష‌యంలో సంఘానికి శిక్ష వేయ‌కుండా, వ్య‌క్తుల‌కు వేయాల‌ని ఆయ‌న కోర్టును కోరారు. ఆ వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని, త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా బాధ్యుణ్ణి చేయాల‌ని కూడా రాజీవ్ కుమార్ కోర‌డం గ‌మ‌నార్హం. ఎన్నిక‌ల సంఘంపై ప‌డిన మ‌చ్చ‌ను తొల‌గించాల్సిన అవ‌స‌రం ఉందని ఆయన కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments