Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుండి కోలుకున్నవారు అయ్యప్ప దర్శనానికి రావద్దు, కేరళ సర్కార్ విజ్ఞప్తి

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (11:24 IST)
ఈ నెల 16 నుండి శబరిమల మండల పూజ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేరళ సర్కార్ కీలక ప్రకటన చేసింది. కరోనా బారి నుండి కోలుకున్న వారు ఇప్పుడిప్పుడే అయ్యప్ప దర్శనానికి రావద్దని కేరళ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీనికి అనుగుణంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కోవిడ్ నుండి బాధితులు కోలుకున్నప్పటికీ వారి శరీరంలో మూడు వారాల పాటు వైరస్ ప్రభావం ఉంటుందని, కాబట్టి ఇటువంటి వారు కొండను ఎక్కేటప్పుడు శ్వాస సమస్య ఏర్పడుతుందని హెచ్చరించింది.
 
శ్వాసకోశ సమస్య లేదని నిర్ధారణ పొందిన వారే కొండకు రావాలని తెలిపారు.వచ్చే నెల చివరి నుంచి మకరవిలక్కు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. అదే విధంగా కొండకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్, భౌతిక దూరం పాటించాలని తెలిపింది. స్వామివారి దర్శనానికి 24 గంటల ముందుగా కరోనా నెగటివ్ నిర్ధారణ సర్టిఫికేటు తీసి వాటిని తమకు సమర్పించాలని తెలిపింది.
 
శబరిమల నుంచి నీలిమల, శరణ్గుత్తి వరకు ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని తెలిపారు. ఆయా ప్రాంతాలలో ఆక్సిజన్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అయినప్పటికీ ఆక్సిజన్ అందక ప్రతి ఏడాది సగటు 25 మంది గుండెపోటుతో మరణిస్తున్నారని తెలిపింది.
 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments