Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇతరులను మొరగొద్దంటారు.. తాము మాత్రం ఇంకా అతిగా మొరుగుతారు. ఏం మొరుగుళ్లో ఇవి?

మరోసారి ఇస్లాంకు వ్యతిరేకంగా మొరిగితే.. ముఖం మీద యాసిడ్ పోస్తానంటూ బెంగళూరులో ఉండే మళయాళీ యువతి అంజియా అష్మిన్‌ను కేరళకు చెందిన ఓ ముస్లిం వ్యక్తి బెదిరించాడు. సమాజంలో ఉన్న పలు రకాల రుగ్మతలపై కోజికోడ్‌కు చెందిన అంజియా తరచు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉం

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (09:00 IST)
మరోసారి ఇస్లాంకు వ్యతిరేకంగా మొరిగితే.. ముఖం మీద యాసిడ్ పోస్తానంటూ బెంగళూరులో ఉండే మళయాళీ యువతి అంజియా అష్మిన్‌ను కేరళకు చెందిన ఓ ముస్లిం వ్యక్తి బెదిరించాడు. సమాజంలో ఉన్న పలు రకాల రుగ్మతలపై కోజికోడ్‌కు చెందిన అంజియా తరచు సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటారు. ఆమె కేరళ ఫేస్‌బుక్ సర్కిళ్లలో బాగా తెలిసిన మనిషి. ఇటీవల ఆమె ఫేస్‌బుక్‌లో ఇద్దరు పురుషులు, ఒక మహిళతో కలిసి తానున్న ఫొటో ఒకదాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. కాసేపటికే దానిపై కామెంట్లు వెల్లువెత్తాయి. అందులో ఆమె నుదుటి మీద బొట్టు పెట్టుకోవడమే కాక, ముసుగు కూడా ధరించలేదు. 
 
దాంతో.. నిజంగా నువ్వు ముస్లింవేనా అంటూ కొంతమంది ఆమెను తిట్టిపోయడం మొదలుపెట్టారు. మరి కాసేపటికి వ్యభిచారి అంటూ కామెంట్ చేశారు. ఇంతకుముందు మళయాళీ ముస్లిం నటులు ఆసిఫ్ అలీ, ఫహాద్ ఫాసిల్, దుల్కర్ సల్మాన్ తమ భార్యలతో కలిసి ఉన్న ఫొటోలు పోస్ట్ చేసినప్పుడు వాళ్లు కూడా ముసుగులు ధరించకపోవడంతో ఇలాంటి వ్యాఖ్యలు వాళ్ల మీద కూడా గతంలో చేశారు.
 
అయితే.. ఈ వ్యాఖ్యలతో అంజియా ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను తన ఇష్టం వచ్చినట్లు జీవిస్తానని, అడగడానికి మీరెవరంటూ గట్టిగా చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చింది. ఇస్లామిక్ సనాతనవాదాన్ని, మోరల్ పోలీసింగును ఆమె ఘాటుగా విమర్శించింది. అయితే.. ఆమె వ్యాఖ్యలతో ఇగో దెబ్బతిన్న మునీర్ ధీర అనే ఫేస్‌బుక్ యూజర్ అయితే, ఆమె మరోసారి ఇస్లాంకు వ్యతిరేకంగా మొరిగితే ముఖం మీద యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అయితే.. కేవలం విమర్శలు మాత్రమే కాదు, అంజియాకు మద్దతుగా కూడా చాలామంది నిలిచారు. తన ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు ఆమెకు ఉందని, ఆమె మీద మతాన్ని రుద్దడం సరికాదని కూడా అన్నారు.
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments