Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్యే రోజాపై మరో యేడాది పాటు సస్పెన్షన్... ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు

వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజాపై మరో యేడాది పాటు సస్పెన్షన్‌ను పొడగించే అవకాశం ఉంది. ఈ మేరకు సభా హక్కుల సంఘం (ప్రివిలేజే కమిటీ) సిఫార్సు చేసింది. దీనిపై సభ తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (08:46 IST)
వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజాపై మరో యేడాది పాటు సస్పెన్షన్‌ను పొడగించే అవకాశం ఉంది. ఈ మేరకు సభా హక్కుల సంఘం (ప్రివిలేజే కమిటీ) సిఫార్సు చేసింది. దీనిపై సభ తుది నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
 
అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే అనిత స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన దానిని సభా హక్కుల సంఘానికి పంపారు. ఇందుకు సంబంధించిన నివేదికను సభాసంఘం సిద్ధం చేసింది. రోజా అంశం కనుక అసెంబ్లీలో ప్రస్తావనకు వస్తే ఆమెను మరో ఏడాదిపాటు సస్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
ఇదే విషయాన్ని టీడీపీ నేతలు పలుమార్లు బహిరంగంగానే పేర్కొన్నారు. అలాగే వైసీపీకి చెందిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రాజా, రామకృష్ణారెడ్డి, ముత్యాలనాయుడు, శ్రీనివాసులు తదితరులను కూడా సభాహక్కుల కమిటీ విచారించింది. ఈ మేరకు సిద్ధం చేసిన నివేదికను స్పీకర్‌కు అందించింది. మంగళవారం సభలో ఆ నివేదికలపై ప్రస్తావన ఉంటుందేమోనన్న గుబులు ఇప్పుడు వైసీపీలో మొదలైంది.
 
కాగా, గతంలో సభాపతి కోడెల శివప్రసాద్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రోజాపై సస్పెన్షన్ విధించిన విషయం తెల్సిందే. దీంతో గత యేడాదికాలంగా రోజా సభా కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అనిత చేసిన ఫిర్యాదుతో రాజాపై మరో యేడాది పాటు సస్పెన్షన్ కొనసాగించే అవకాశం ఉంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments