Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బాలికపై 50మంది రేప్.. ఏడు నెలల గర్భం.. కేరళ బుల్లితెర నటుడికి లింక్..?

మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరో దిలీప్.. ఓ నటి కిడ్నాప్, వేధింపుల కేసులో అరెస్టయిన తరుణంలో.. అదే సినీ రంగానికి చెందిన ఓ బుల్లితెర నటుడు 15ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి గర్భానికి కారణమై

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (15:08 IST)
మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్ర హీరో దిలీప్.. ఓ నటి కిడ్నాప్, వేధింపుల కేసులో అరెస్టయిన తరుణంలో.. అదే సినీ రంగానికి చెందిన ఓ బుల్లితెర నటుడు 15ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి గర్భానికి కారణమైయ్యాడని వార్తలు వస్తున్నాయి. బుల్లితెర నటుడు వాడుకున్న అదే చిన్నారిపై 50 మందికి పైగా  అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ చిన్నారి వ్యభిచార రొంపిలో చిక్కుకుని.. అనేకమంది చేతిలో నలిగిపోయింది. ఈ కేసులో కేరళ బుల్లితెర నటుడు విష్ణుసాగర్‌తో పాటు మరికొందరు బుల్లితెర నటులకు లింకుందని జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళ, తిరువనంతపురం సమీపంలో కుత్తిక్కాడు అనే ప్రాంతానికి చెందిన ఓ బాలిక పోలీసులకు చేసిన ఫిర్యాదులో.. తనపై అనేకమంది అత్యాచారం జరపడంతో.. ప్రస్తుతం ఏడునెలల గర్భం దాల్చానని తెలిపింది. తనను మోసం చేసి వాడుకున్న ఓ నటుడు తనను పెళ్లి చేసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు జరిపిన దర్యాప్తులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
బాధితురాలు పేదకుటుంబానికి చెందడంతో.. దాన్ని ఆసరాగా తీసుకుని.. అదే ప్రాంతానికి చెందిన శ్రీకళ (40) అనే మహిళ.. డబ్బు ఆశచూపి.. రెండేళ్ల పాటు వ్యభిచార రొంపిలోకి దించేసింది. ఇప్పటిదాకా 50మందికి పైగా ఆమెపై అత్యాచార ఘాతుకానికి పాల్పడ్డారు. శ్రీకళకు ముగ్గురు ఆటోడ్రైవర్లు సహకరించారు. ఆటోలో ఆమెను తిప్పుతూ చిన్నారిని వ్యభిచారం చేయించారు. ఆటో డ్రైవర్లు కూడా ఆమెపై ఆటోలోనే కామవాంఛను తీర్చుకున్నారు. 
 
ఈ చిన్నారికి బుల్లితెర నటుడు విష్ణుసాగర్‌ల మధ్య శారీరక సంబంధం వుందని.. ఆమెను విష్ణుసాగర్ అనేకసార్లు వాడుకున్నాడని తెలిసింది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చిందని తెలిసింది. అయితే ఆ చిన్నారిని విష్ణుసాగర్‌కు పెళ్లి చేసి భారీగా డబ్బు గుంజాలనే డ్రామాకు శ్రీకళ టీమ్ ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో శ్రీకళతో పాటు ముగ్గురు ఆటో డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పలు బుల్లితెర నటులకు సంబంధాలున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం