Webdunia - Bharat's app for daily news and videos

Install App

దొంగతనానికి వెళ్లి చేపల కూర తిని.. హాయిగా నిద్రపోయాడు.. చివరికి?

Webdunia
బుధవారం, 17 జూన్ 2020 (13:18 IST)
దొంగతానికి వెళ్లి చేపల కూర తిని మస్తుగా నిద్రపోయిన ఓ దొంగను జనాలు ఉతికేశారు. చోరీకి వెళ్లి.. ఆకలేసిందో ఏమో కానీ ఆ దొంగ ఆ ఇంట్లో వండిపెట్టిన చేపలకూర తిని హాయిగా నిద్రపోయాడు. అంతే.. జనాలకు చిక్కాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లాలో సతీష్ అనే యువకుడు ఓ ఇంట్లో దొంగతనం చేయటానికి వచ్చాడు. 
 
ఏమేమీ నొక్కేద్దామా అనుకుంటూ ఇల్లంతా కలియతిరిగాడు. బంగారంగానీ.. విలువైన వస్తువులు ఏమీ కనిపించలేదు. ఏమీ దొరక్కపోవడంతో..  వంటింట్లోంచి ఘుమఘుమలాడే చేపల పులుసు కూర వాసన వచ్చింది. పాపం.. నోరూరింది. ఆగలేకపోయాడు. కూర రుచిగా వుండటంతో కడుపు నిండా లాగించేశాడు. డాబా మీదకెళ్లి హాయిగా నిద్రపోయాడు. 
 
ఇంతలో ఇంటి యజమాని నిద్రలేచాడు. ఇంట్లో చిందరవందరగా ఉన్న వస్తువులు చూసి దొంగతనం జరిగిందని భయపడిపోయాడు. ఇరుగు పొరుగు వారికి చెప్పాడు. దొంగ పారిపోయాడనుకుని సీసీటీవీ కెమేరాల పుటేజ్‌ను పరిశీలించారు.
 
చేపల కూరంతా తినేసి మేడమీదనుంచి దూకి పారిపోయి ఉంటాడని అనుకుంటూ.. మేడపైకి వెళ్లారు. అక్కడే నిద్రపోతున్న దొంగను చూసి షాకయ్యారు. ఆపై అతడ్ని లేపి.. చితకబాదారు. ఆపై పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments