Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త టెన్షన్... స్కిన్ బ్లాక్ ఫంగస్ .. చిత్రదుర్గ జిల్లాలో తొలి కేసు

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (10:02 IST)
ఇప్పటికే దేశ ప్రజలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ బారినపడిన అనేక వేల మంది మృత్యువాతపడుతున్నారు. ఈ వైరస్ నుంచి కోలుకోకముందే దేశంలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇందులో అనేక రకాలైన ఫంగస్ కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఎల్లో ఫంగస్ కేసు ఏపీలోని కర్నూలు జిల్లాలో నమోదైంది. ఇపుడు కొత్తగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు కొత్తగా నమోదైంది. కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ కేసు నమోదైంది. ఇది దేశంలో అల‌జ‌డి రేపింది. 
 
చిత్రదుర్గ జిల్లాలో 50 ఏళ్ల రోగిలో స్కిన్ బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని దేశంలో ఇదే ఫ‌స్ట‌ కేసు అని వైద్యుల బృందం తెలిపింది. నెల క్రితం కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న బాధితుడి చర్మంపై బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని వైద్యులు తెలిపారు. బాధితుడికి మధుమేహం కూడా ఉందని పేర్కొన్నారు. 
 
బాధితుడి కుడి చెవి దగ్గర ఉన్న చర్మంలో బ్లాక్‌ ఫంగస్‌ కనిపించిందని డాక్ట‌ర్లు తెలిపారు. ఇప్పటికే ఆ బాధితుడికి మొదటి దశ ఆప‌రేష‌న్ ద్వారా చర్మంపై ఉన్న బ్లాక్‌ ఫంగస్‌ను తొలగించగా ఇప్పుడు రెండో దశ చికిత్సకు సిద్ధమవుతున్నారు. బ్లాక్​ ఫంగస్​పై రోజుకో వార్త దేశ ప్రజలను భయపెడుతోంది.
 
కాగా.. ఈ బ్లాక్​ ఫంగస్​ మెదడుపైనా ప్రభావం చూపిస్తోందని తేలింది. మధ్యప్రదేశ్​ ఇండోర్​లోని మహారాజా యశ్వంత్​రావ్​ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన రోగుల్లో 15శాతం మంది మెదళ్లలో ఈ బ్లాంక్​ ఫంగస్​ను గుర్తించారు. 
 
తలనొప్పి, వాంతులు బ్లాక్ ఫంగ‌స్ యొక్క‌ ప్రాథమిక లక్షణాలు కాగా.. మెదడులో వ్యాధి ముదిరితే రోగి సృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. సైనస్​ ద్వారా ఈ బ్లాక్​ ఫంగస్​ మొదడుకు చేరే అవకాశముందని వైద్యులు అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments