తమిళనాడు, నాగపట్నం, వేళాంగణిలో ఓ బాలుడు సామాజిక సేవకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కన్న తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్, ఇతర ప్రాంతాల్లో వదిలిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి సంఖ్య పెరిగిపోతున్న ఈ కాలంలో తమిళనాడు, వేళాంగణి రోడ్డుకు సమీపంలో వున్న వృద్ధులకు నాలుగేళ్ల బాలుడు ఆహారంతో పాటు నీటిని అందజేశాడు.
ఆ బాలుడి టీషర్ట్ వెనుక సామాజిక సేవకుడని రాసి వుంది. ఇంకా సంప్రదింపు కోసం ఫోన్ నెంబర్ కూడా వుంది. రోడ్డుపై నివసిస్తున్న వృద్ధులకు ఆ బాలుడు భోజనం ప్యాకెట్లతో పాటు నీటి బాటిళ్లను అందజేశాడు. దాన్ని స్వీకరించిన వృద్ధులు ఆ బాలుడిని ఆశీర్వదించారు.