Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ బి.బి.ఏ.4 ప్రకటన

BB4 working title

డీవీ

, మంగళవారం, 11 జూన్ 2024 (11:59 IST)
BB4 working title
గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను పూర్తి చేసి ఇండియన్ సినిమా క్రేజీ కాంబినేషన్‌లలో ఒకటిగా నిలిచారు. అత్యధిక వసూళ్లు రాబట్టిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత ఈ మ్యాసీవ్ ఎపిక్ కాంబో మళ్లీ చేతులు కలిపింది. 
 
వీరిద్దరూ నాలుగోసారి జత కడుతున్నారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో #BB4 చిత్రం ఈ రోజు NBK పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. 'లెజెండ్' సినిమా నిర్మాణ భాగస్వాములైన రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై #BB4ని భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఎం తేజస్విని నందమూరి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
 
అనౌన్స్‌మెంట్ పోస్టర్ డివోషనల్ వైబ్ తో నిండి ఉంది. పోస్టర్ లో ఒక మ్యాసీవ్ రథచక్రం పవర్ ఫుల్ గా కనిపించింది, నెంబర్ 4ని రుద్రాక్ష బ్రాస్‌లెట్‌ను కట్టిబడివుంది. పోస్టర్ లో ఎర్రటి సూర్యుడు, పడుతున్న తోకచుక్కలు చూస్తుంటే నందమూరి హీరోతో మాస్ డైరెక్టర్ ఈసారి ఎలాంటి సినిమా తీయబోతున్నాడో తెలుసుకోవాలనే క్యురియాసిటీని కలిగిస్తుంది.
 
బాలకృష్ణ, బోయపాటి తెలుగు సినిమాలో బెంచ్‌మార్క్‌ను సెట్ చేశారు. ఈ డెడ్లీ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ హై బడ్జెట్, టాప్ క్లాస్ టెక్నికల్ వ్యాలుస్ తో రూపొందించబడుతుంది. బాలకృష్ణకు మోస్ట్ ఎక్స్పెన్సివ్ సినిమా ఇదే. #BB4 సంబధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కల్కి 2898 AD’ ట్రైలర్ ఫెంటాస్టిక్ - దేశం గర్వించేలా ఉంటుంది: నాగ్ అశ్విన్