Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూటులో బుసకొట్టిన నాగుపాము: సోషల్ మీడియాలో వీడియో వైరల్!

వర్షాకాలంలో ఇంట్లోకి పాములు, పురుగులు వచ్చేస్తాయి. అలా షూలో నాగుపాము వచ్చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. షాక్ తప్పదు కదా.. అదే మరి. ఆఫీసుకు టైమవుతుందని టిప్ టాప్‌గా రెడీ అయి షూ వేసుకుందామని చెప్పుల స్ట

Webdunia
మంగళవారం, 19 జులై 2016 (10:40 IST)
వర్షాకాలంలో ఇంట్లోకి పాములు, పురుగులు వచ్చేస్తాయి. అలా షూలో నాగుపాము వచ్చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. షాక్ తప్పదు కదా.. అదే మరి. ఆఫీసుకు టైమవుతుందని టిప్ టాప్‌గా రెడీ అయి షూ వేసుకుందామని చెప్పుల స్టాండు వద్దకు వచ్చిన ఓ వ్యక్తి దానిలో ఓ నాగుపాము ఉండటం చూసి షాక్ అయ్యాడు. బూటులో చిన్న నాగుపాము పడగ విప్పి నాట్యం చేయడం చూసిన వ్యక్తి వెంటనే తేరుకొని జేబులో ఉన్న తన స్మార్టు ఫోన్ తీసి వీడియో తీశారు. 
 
వర్షాకాలం కావడంతో ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ చిన్న నాగుపాము వచ్చి బూటులో హాయిగా నిద్రపోయింది. షూ కదిలించగానే బూటులోనే బుసకొడుతూ డ్యాన్స్ చేసింది. ఆ తర్వాత తన దారేంటో చూసుకుని వెళ్ళిపోయింది. బూటూలో నాగుపాము డ్యాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో సదరు వ్యక్తి అప్ లోడ్ చేయడంతో లైకులు వెల్లువెత్తుతున్నాయి. షేర్లు పెచ్చరిల్లిపోతున్నాయి. ఈ వీడియో జూలై 13వ తేదీన యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. 

డల్లాస్‌లో థమన్. ఎస్ భారీ మ్యూజికల్ ఈవెంట్ బుకింగ్స్ ఓపెన్

బాలీవుడ్ సినిమాల కోసం తొందరపడట్లేదు.. నాగచైతన్య

థియేటర్లు బాగానే సంపాదించాయిగా... ఇప్పుడు మొత్తం పోయింది... గోవిందా!

సహచర నటి పవిత్ర ఎడబాటును భరించలేక నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య!!

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

పాలులో రొట్టె తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments