Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంజాబ్‌లో దారుణం.. వ్యభిచార రొంపిలోకి తల్లే నెట్టేసింది.. మైనర్‌పై అత్యాచారం

Webdunia
బుధవారం, 22 సెప్టెంబరు 2021 (17:39 IST)
మహిళలకు రక్షణ కరువైంది. వయోబేధం లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్ బటిండాలో దారుణం వెలుగు చూసింది. కన్నతల్లే తన కుమార్తెపై అత్యాచారానికి ఉసిగొల్పింది. చివరికి తల్లి చేసే అరాచకం భరించలేక బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. 
 
వివరాల్లోకి వెళితే.. మైనర్ బాలిక(14) తల్లితో కలిసి బటిండాలోని సివిల్ లైన్స్‌లో నివాసం ఉంటోంది. బాధితురాలు తల్లి తొమ్మిదేళ్ల క్రితం తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి కూతరుతో కలిసి జీవనం సాగిస్తోంది.
 
అయితే, డబ్బు సంపాదన కోసం ఆ తల్లి తన కూతురును వ్యభిచార రొంపిలోకి నెట్టేసింది. తానే దగ్గరుండి తన కూతురుపై అత్యాచారం చేయించేది. తాజాగా జిరాక్ పూర్ హోటల్‌లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది బాలిక తల్లి ప్రమేయంతోనే జరిగింది. 
 
తల్లి అరాచకాలను తట్టుకోలేకపోయిన బాలిక.. జిరాక్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు ఆమె తల్లి సహా ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 
 
జిరాక్‌పూర్ హోటల్ నిర్వాహకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బాధిత బాలికను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments