Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో విజయ్‌తో పుదుచ్చేరి సీఎం రంగస్వామి భేటీ

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (14:18 IST)
అగ్రహీరో విజయ్‌తో పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి సమావేశమయ్యారు. రెండు రోజుల క్రితం ఈ భేటీ జరిగింది. చెన్నైనగర శివారు ప్రాంతమైన పనైయూరులో ఉన్న హీరో విజయ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. విజయ్ ఇంటికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి స్వయంగా వెళ్లి సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ సమయంలో విజయ్ అభిమానుల సంఘం అఖిల భారత అధ్యక్షుడు బుస్సీ ఆనందం కూడా ఉన్నారు.
 
కాగా, తమిళనాడు రాష్ట్రంలో నగర, పురపాలక ఎన్నికలకు త్వరలో పోలింగ్ జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ మక్కల్ ఇయ్యక్కం తరపున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఈ సంస్థ తరపున పోటీ చేసిన అనేక మంది అభ్యర్థులు విజయం సాధించారు. ఇపుడు మరోమారు బరిలోకి నిలిచారు. 
 
అదేసమయంలో పుదుచ్చేరిలో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్.రంగస్వామి తీవ్ర నిరాశలో కూరుకునిపోయివున్నారు. పేరుకు మాత్రమే సీఎంగా ఉన్నారే, పెత్తనం మాత్రం బీజేపీ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే విజయ్‌తో సీఎం రంగస్వామి భేటీ కావడం ఇపుడు పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments