Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పది రాష్ట్రాల్లోనే 70 శాతం యాక్టివ్ కేసులు

Webdunia
ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (17:02 IST)
దేశంపై కరోనా  వైరస్ పంజా విసిరింది. ఈ వైరస్ ఉధృతి రోజురోజుకూ ఎక్కువైపోతోంది. ప్రతి రోజూ కనీసం మూడన్నర లక్షల మంది కరోనా వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ సహా 10 రాష్ట్రాల్లోనే సుమారుగా 70 శాతం కేసులు నమోదవుతున్నాయి. 
 
ఈ పది రాష్ట్రాల్లో ఒకే రోజులో నమోదైన కొత్త కరోనా కేసుల్లో 74.53శాతం ఉన్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో నమోదైన కేసుల సంఖ్య 1,69,60,172 కు చేరింది. ఒకే రోజు 3.49లక్షల నమోదయ్యాయి. ఇందులో కర్ణాటక, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, గుజరాత్‌తో పాటు రాజస్థాన్‌ రాష్ట్రాల్లో 74.53శాతం నమోదయ్యాయి.
 
మహారాష్ట్రలో అత్యధికంగా రోజువారీ కొత్త కేసులు 67,160 వెలుగు చూశాయి. ఆ తర్వాత యూపీలో 37,944, కర్ణాటకలో 29,438 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 26,82,751కు పెరిగింది. దేశంలోని మొత్తం కేసుల్లో 15.82శాతంగా ఉందని తెలిపింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, రాజస్థాన్‌, తమిళనాడు, గుజరాత్‌, కేరళల్లోనే 69.94 శాతం యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వశాఖ తెలిపింది.
 
మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, గుజరాత్‌, తమిళనాడు, రాజస్థాన్‌, బిహార్‌, పశ్చిమ బెంగాల్‌లో రోజువారీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది మరో వైపు జాతీయ మరణాల రేటు పడిపోతుంది, ప్రస్తుతం 1.13శాతంగా ఉందని పేర్కొంది. నిన్న ఒకే రోజు 2,767 మరణాలు నమోదవగా.. మహారాష్ట్రలో గరిష్ఠంగా 676 మంది కన్నుమూశారు. ఆ తర్వాత ఢిల్లీలో 357 మరణాలు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నటుడిగా మల్లేశం ప్రియదర్శికి లైఫ్ ఇచ్చినట్లే 23 కూడా అందరికీ ఇస్తుంది : చంద్రబోస్

టెర్రరిజం, దేశ భక్తి అంశాలతో 6జర్నీ తెరకెక్కించాం - దర్శకుడు బసీర్ ఆలూరి

No Telugu: పబ్లిసిటీలో ఎక్కడా తెలుగుదనం లేని #సింగిల్ సినిమా పోస్టర్లు

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments