Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవాల‌య భూములు హిందువుల‌కే చెందుతాయి: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Webdunia
శుక్రవారం, 16 జులై 2021 (21:30 IST)
మద్రాస్ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. దేవాలయాల భూములు కేవలం హిందువులకు మాత్రమే చెందుతాయ‌ని, వాటి మీద వ‌చ్చే ఆదాయం దేవాలయాల అభివృద్ధికి, హిందువుల కోసమే వాడాల‌ని తీర్పు ఇచ్చింది. ప్రభుత్వాలు దొంగల మాదిరిగా దోచుకొని, ఇతర కార్యక్రమాలు ఇతర మతాలకు వాటిని ఇవ్వకూడద‌ని వివ‌రించింది.

1985లో తమిళనాడులో 5 లక్షల ఎకరాలు దేవాలయాల భూములను ఉండేవి. ప్రస్తుతం 4 లక్షల 50 వేలు మాత్రమే లెక్క చూపిస్తున్నారు. మరి 50 వేల ఎకరాలు ఏమయ్యాయో లెక్క తీయండ‌ని పేర్కొంది. ఆ 50 వేల ఎకరాలను దేవాలయాలకు అప్ప చెప్పండి... ఆలయాల భూములు దేవుడి పేరు మీదనే ఉండాలి. దేవాలయం, వాటి అధికారుల అధీనంలో మాత్రమే ఉండాలి. ప్రభుత్వాలు వాటిపై పెత్తనం చేయకూడదు. హిందువుల కోసం, హిందూ ఆలయాలు అభివృద్ధి హిందూ కార్యక్రమాలకు మాత్రమే ఉపయోగించాలి అని స్పష్టమైన తీర్పు ఇచ్చింది.   
 
త‌మిళ‌నాడులో న‌డుస్తున్న సేవ్ టెంపుల్స్ ఉద్యమంలో భాగంగా, వేసిన ప్ర‌జా వ్యాజ్యానికి మద్రాస్ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. దేవాలయాల భూముల పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాల‌ని, ప్ర‌త్యేక కోర్టులు, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాల‌ని, కేవలం హిందూ దేవాలయాల ఆదాయంతో మాత్రమే ప్రభుత్వాలు నడ‌ప‌రాద‌ని పేర్కొంది.

దేవాల‌యాల ఆదాయాన్ని ప్రభుత్వాల రోజు వారి పరిపాలన కోసం ఎందుకు వాడుతున్నార‌ని, దాతలు హిందూ దేవాలయాలకు, హిందూ దేవుడికి భూములు ఇచ్చార‌ని, దానిని హిందూ ధర్మం కోసమే ఉపయోగించాల‌ని సూచించారు. దేవాలయాలలో ఉన్న అన్ని ఖాళీలు, పోస్టులు భర్తీ చేయాల‌ని, హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాల‌ని, అన్యమతస్తులకు కాద‌ని పేర్కొన్నారు. 
మతం మారితే రిజర్వేషన్ చెల్లదు అని చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన న్యాయ‌మూర్తి ఎస్సార్ మహదేవన్ ఇపుడు ఈ తాజా తీర్పు వెలువ‌రించ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments