Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కరిచింది.. అయినా తల్లిదండ్రులు తిడతారనీ...

Webdunia
సోమవారం, 26 జులై 2021 (16:59 IST)
ఆ చిన్నారిని పాము కరించింది. కానీ, ఆ చిన్నారికి తల్లిదండ్రులంటే అమితమైన భయం. దీంతో పాము కరిచినప్పటికీ.. తల్లిదండ్రులకు కనీసం మాటమాత్రం చెప్పలేదు. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ  వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఉల్వనూరు పంచాయతీ లక్ష్మీదేవిపల్లికి చెందిన బోడ భాస్కర్, భారతి దంపతులకు సంతానం కలగకపోవడంతో ఏడేళ్ల క్రితం బంధువుల పాప అఖిలను దత్తత తీసుకున్నారు. 
 
ఆర్నెళ్ల ప్రాయం నుంచి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. పాపే ప్రాణంగా ఆ దంపతులు బతికారు. ఆదివారం ఎనిమిదో పుట్టినరోజు వేడుకను అమ్మమ్మ ఇంటి వద్ద జరుపుకోవాలని శనివారం కొత్తగూడెంలోని కారుకొండ రామవరం వెళ్లారు. 
 
సాయంత్రం ఆ చిన్నారి స్నేహితులతో కలిసి ఆడుకుంది. ఆ సమయంలో ఓ విష పాము వేలిపై కాటేసింది. దీంతో అఖిల ఒక్కసారి భయపడి ఇంట్లోకి పరుగున వెళ్లింది. తల్లిదండ్రులు తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచిపెట్టింది. కాలికి మేకు గుచ్చుకుందని అబద్ధం చెప్పింది. ఎలాంటి గాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, తెల్లవారేసరికి విష తలకెక్కడంతో మృత్యువొడిలోకి జారుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments