Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ మంత్రి తేజ్‌ప్రతాప్‌కి వారణాసిలో పరాభవం : లగేజి బయటపడేశారు...

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2023 (11:41 IST)
బీహార్ రాష్ట్ర మంత్రి తేజ్‌ప్రతాప్‌కు వారణాసిలో ఘోర పరాభవనం జరిగింది. ఆయన లగేజీని హోటల్ సిబ్బంది బయపడేశారు. ఆయన లేని సమయంలో ఆయన బుక్ చేసుకున్న గది తలుపులు తెరిచి ఆయన లగేజీని తీసుకొచ్చి రిసెప్షన్ వద్ద పడేశారు. తిరిగి హోటల్‌కు వచ్చిన ఆయనకు తన లగేజీ బయటవుండటం చూసి ఒకింత షాక్‌కు గురయ్యారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
ఓ పనిమీద యూపీలోని వారణాసికి వెళ్లిన తేజ్‌ప్రసాద్... వారణాసిలోని ఓ హోటలులో బస చేశారు. ఆ తర్వాత ఆయన తన వ్యక్తిగత పనిమీద హోటల్ బయటకు వెళ్లారు. ఈ సమయంలో మంత్రి లగేజితోపాటు సెక్యూరిటీ సిబ్బంది బ్యాగులను బయటపడేశారు. శుక్రవారం రాత్రి హోటల్‌కు తిరిగివచ్చిన మంత్రి తమ లగేజి రిసెప్షను వద్ద ఉంచడం చూసి ఖంగుతిన్నారు. మంత్రికి కేటాయించిన గదిని ఆయన గైర్హాజరీలో తెరిచి, వస్తువులను బయట పడేశారని తేజ్‌ప్రతాప్‌ యాదవ్‌ పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఏసీపీ సంతోష్‌సింగ్‌ ఈ ఘటనపై మాట్లాడుతూ.. బీహార్‌ మంత్రి పేరిట ఏప్రిల్‌ 6వ తేదీ (గురువారం) ఒక్కరోజు మాత్రమే గదిని బుక్‌ చేసినట్లు హోటల్ యాజమాన్యం చెప్పిందన్నారు. శుక్రవారం ఆ గదిని మరొకరికి కేటాయించడంతో బయటకు వెళ్లిన మంత్రి కోసం ఎదురుచూసి, చివరకు ఖాళీ చేసి లగేజిని రిసెప్షన్‌ వద్దకు చేర్చినట్లు తెలిపారని చెప్పారు. దీనిపై మంత్రి అనుచరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments