భర్త వేధింపులకు టెక్కీ ఆత్మహత్య... పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని?

సెల్వి
శుక్రవారం, 5 జులై 2024 (14:56 IST)
భర్త వేధింపులకు ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడింది. వరకట్న వేధింపులతో విసిగిపోయిన ఓ టెకీ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయనగరం జిల్లా పులహడగలిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. బసాపూర ప్రాంతానికి చెందిన సునీల్‌తో పూజకు రెండేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు ఎంబీఏ గ్రాడ్యుయేట్స్. పూజ ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. ప్రస్తుతం వీరిద్దరూ గంగమ్మ గుడి సమీపంలో ఓ ఇంట్లో నివసిస్తున్నారు. 
 
కానీ పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలంటూ హింసిస్తున్నాడు. అయితే అతడి హింసను భరించలేక ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో పూజ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
 
బయటకు వెళ్లిన భర్త ఇంటికి వచ్చి చూడగా ఉరికొయ్యకు వేలాడుతూ కనిపించింది. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అల్లుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భర్తతో విబేధాల కారణంగా తన కూతురు బలవన్మరణానికి పాల్పడిందని కంప్లయింట్‌లో పేర్కొన్నారు. 
 
పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని హింసించడంతోనే ఆమె చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అల్లుడు సునీల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments