Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాపాలు పోవాలంటే గంగలో స్నానం చేయాలి ... కేసులు పోవాలంటే బీజేపీలో చేరాలి!

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (13:00 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపులపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన మరుసటిరోజే ఈ నలుగురు నేతలు బీజేపీలో చేరారు. 
 
వీరి చేరికపై సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. పాపాలు పోవాలంటే గంగలో స్నానం చేయాలి.. కేసులో పోవాలంటే బీజేపీలో చేరాలంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతేకాకుండా, సుజనా చౌదరి బ్యాంకులను మోసం చేయలేదనీ, బ్యాంకులే సుజనా చౌదరిని మోసం చేశాయని కామెంట్స్ చేస్తున్నారు. పైగా, వారిని రక్షించేందుకే ప్రధానమంత్ర నరేంద్ర మోడీ వారిని పార్టీలో చేర్చుకున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, ఇటీవల మాజీ మంత్రి సుజనా చౌదరికి చెందిన కంపెనీలు, నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసిన విషయం తెల్సిందే. పైగా, డొల్ల కంపెనీల పేరుతో బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలను సుజనా చౌదరి రుణాలు తీసుకుని, వాటిని తిరిగి చెల్లించలేదన్న ఆరోపణలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసుల నుంచి బయటపడేందుకే సుజనా చౌదరి టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారని అనేక మంది రాజకీయ నేతలు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments