Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మీటూ' దెబ్బకు సుహెల్ సేథ్‌కు 'టాటా'... బ్రాండ్ కన్సల్టెంట్‌ డీల్ రద్దు

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (13:20 IST)
మీటూ ఉద్యమం పుణ్యమాని కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఇపుడు ప్రముఖ రచయిత, నటుడు సుహెల్ సేథ్ వంతు వచ్చింది. ఆయన్ను బ్రాండ్ కన్సల్టెంట్‌ పదవి నుంచి టాటా గ్రూప్ కంపెనీ టాటా సన్స్ తొలగించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బాలీవుడ్‌లో ప్రముఖ రచయితగా కొనసాగుతున్న సుహెల్ సేథ్‌పై అనేక మంది మహిళలు సంచలన ఆరోపణలు చేశారు. తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు పలువురు మహిళలు ఆరోపించారు. దీంతో టాటా గ్రూప్ కంపెనీ టాటా సన్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. కంపెనీ బ్రాండ్ కన్సల్టెంట్‌గా ఆయనతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతోపాటు ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించింది. 
 
సేథ్‌పై వచ్చిన ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపిన మీదట కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 2016లో టాటా గ్రూప్ ఛైర్మన్‌ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించిన తర్వాత.. ఆ వివాదం నుంచి కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌‌‌కు మళ్లీ పునర్వవైభవం తేవడంలో సేథ్ కీలక పాత్ర పోషించినట్టు చెబుతారు. 
 
'క్యాలెండర్ గర్ల్స్' నటుడిగా గుర్తింపుతెచ్చుకున్న సేథ్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు దాదాపు ఆరుగురు మహిళలు ఆరోణలుచేశారు. ఈ ఆరోపణలు చేసినవారిలో ప్రముఖ నటి, మోడల్ దియాంద్ర సోరెస్, సినీ నిర్మాత నటాషా, రచయిత ఇరా త్రివేది, జర్నలిస్టు మందాకినీ గెహ్లాల్, ఇషిత యాదవ్, జాస్మిన్ దేవేకర్ సహా తదితరులు ఉన్నారు. దీంతో ఆయనను తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం