Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

ఠాగూర్
శనివారం, 30 నవంబరు 2024 (09:30 IST)
ఓ రైల్వే లైను నిర్మాణానికి బ్రిటీష్ పాలకుల హయాంలో చేపట్టిన సర్వే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేళ్లు నిండిన తర్వాత పూర్తి చేసుకోవడం గమనార్హం. ఈ మాటలు వింటుంటే కాస్త విచిత్రంగా ఉందనుకోవద్దు. అక్షరాలా సత్యం 170 కిలోమీటర్ల పొడవుండే తనక్‌పూర్ - భాగేశ్వర్ రైల్వే లైను సర్వే పనులు ఎట్టకేలకు పూర్తిచేశారు. ఈ రైలు మార్గాన్ని నిర్మించేందుకు రూ.49 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ రైల్వే ప్రాజెక్టు పూర్తయితే భారతీయ రైల్వేలు చైనా, నేపాల్ సరిహద్దుకు చేరువ అవుతాయి. 
 
తనక్‌పూర్.. నేపాల్, చైనా సరిహద్దు ప్రాంతం. తనక్‌పూర్ - భాగేశ్వర్ రైలు మార్గం దశాబ్దాల కల. బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో 1882లో తొలిసారిగా రైలు మార్గాన్ని నిర్మించే పనిని ప్రారంభించింది. రైల్వే లైన్ కోసం మొదటి సర్వే 1912లో జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏడు సర్వేలు జరిగాయి. చివరిగా రెండేళ్లపాటు సాగిన తుది సర్వే నివేదికను ఇంజనీరింగ్ డిజైనింగ్ ద్వారా రైల్వే శాఖకు అందజేసింది.
 
తుది సర్వే ప్రకారం .. తనక్‌పూర్ - భాగేశ్వర్ మధ్య రైలు మార్గంలో 12 రైల్వే స్టేషన్లను నిర్మించాల్సి ఉంది. 170 కిలోమీటర్ల రైల్వే లైన్ మధ్యలో ఈ రైల్వే స్టేషన్లు నిర్మించనున్నారు. రైల్వే లైన్ కోసం 452 హెక్టార్ల భూమిని కూడా సేకరించాల్సి ఉంది. ఇందులో 27 హెక్టార్లు ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమి ఉంది. 
 
తనక్‌పూర్ - భాగేశ్వర్ రైలు మార్గాన్ని 2012లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టుగా పరిగణించింది. అప్పట్లో ఈ రైల్వే లైనులో 54 కిలోమీటర్ల మేర 72 సొరంగాలను ప్రతిపాదించారు. కాళీ నది ఒడ్డున తనక్‌పూర్ నుంచి పంచేశ్వర్ వరకూ ఈ రైలు మార్గాన్ని నిర్మించాలి. పంచేశ్వర్ దాటి సరయూ నది ఒడ్డున వెళుతుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం ద్వారా అల్మోరా, పితోర్ఢ్, చంపావత్, భాగేశ్వర్ జిల్లాలు నేరుగా ప్రయోజనం పొందుతాయి. అలాగే పర్వతానికి వెళ్లే మార్గం సులభతరం అవుతుంది. రైల్వే శాఖ తుది సర్వే పూర్తి అయిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments