Webdunia - Bharat's app for daily news and videos

Install App

#TamilNaduElections2021 : మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసిన డీఎంకే

Webdunia
ఆదివారం, 2 మే 2021 (12:40 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష డీఎంకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. దీంతో ఆ పార్టీకి చెందిన నేతలు, శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. 
 
ఆదివారం వెల్లడవుతున్న ఓట్ల లెక్కింపులో డీఎంకే అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. త‌మిళ‌నాడులో మొత్తం 234 స్థానాలు ఉండ‌గా, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 118 స్థానాల్లో గెల‌వాలి. డీఎంకే ఒంటరిగానే 117, అన్నాడీఎంకే 78 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
 
డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్ 13 చోట్ల, ఎండీఎంకే 3, సీపీఎం 2, సీపీఐ 2, వీసీకే 3, ఇతరులు 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అలాగే, అన్నాడీఎంకే మిత్రపక్షాలైన పీఎంకే 7, బీజేపీ 5, ఇతరులు ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి. 
 
మరోవైపు, పదేళ్ళ తర్వాత తమ పార్టీ అత్య‌ధిక స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తూ మ్యాజిక్ ఫిగ‌ర్ దాట‌డంతో డీఎంకే నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ప‌లు చోట్ల బాణ‌సంచా కాల్చుతూ డ్యాన్సు చేస్తున్నారు. 
 
కాగా, త‌మిళ‌నాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్‌, మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధినేత‌ కమల హాసన్ వారు పోటీ చేసిన స్థానాల్లో ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. సినీ ఖుష్బూ, దర్శకుడు సీమాన్‌లు వెనుకంజలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments