Webdunia - Bharat's app for daily news and videos

Install App

మదుమలై ఫారెస్ట్‌లోని ఏనుగులకు సోకిన కరోనా?

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (08:18 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ ఒకవైపు శాంతిస్తోంది. మరోవైపు, వన్యమృగాలకు ఎక్కువగా సోకుతుంది. ఇప్పటికే చెన్నై వండలూరు జూలోని సింహాలకు ఈ వైరస్ సోకింది. ఇందులో నిలా అనే ఆడ సింహం చనిపోగా, మరో సింహాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో మదుమలై అటవీ ప్రాంతంలోని తెప్పక్కుడి క్యాంపు ఏరియాలో ఉన్న గజరాజులకు ఈ వైరస్ సోకినట్టు అనుమానిస్తున్నారు. ఏకంగా 28 ఏనుగులకు ఈ వైరస్ సోకినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ ఏనుగుల నుంచి నమూనాలు సేకరించిన అధికారులు... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇజ్జత్ నగ‌ర్‌లో ఉన్న ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు పంపారు.
 
ముందుజాగ్రత్తగా తమిళనాడులోని ముదుమలై అభయారణ్యంలో 28 ఏనుగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వీటిలో 26 పెద్ద ఏనుగులు కాగా, రెండు పిల్ల ఏనుగులు ఉన్నాయి. దీనిపై ముదుమలై అభయారణ్యం వెటర్నరీ నిపుణుడు డాక్టర్ కె.రాజేశ్ కుమార్ మాట్లాడుతూ, నమూనాల సేకరణలో తమకు ఏనుగులు చాలావరకు సహకరించాయన్నారు. 
 
మత్తు ఇవ్వకుండానే వాటి నుంచి నమూనాలు సేకరించామని అన్నారు. మత్తు ఇస్తే అది తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. ఇది కేవలం పరిశీలన కోసమేనని, ఏనుగుల్లో ఏ ఒక్కదానికీ అనుమానిత లక్షణాలు లేవని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments