Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందు జేసీబీ తర్వాత బ్రిడ్జిని ఢీకొట్టిన మినీ బస్సు - 17 మంది మృత్యవాత

Webdunia
బుధవారం, 9 జూన్ 2021 (08:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మినీ బస్సు అదుపుతప్పి ముందు జేసీబీని ఢీకొట్టింది. ఆ తర్వాత వంతెనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందగా మరో 24 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. మంగళవారం రాత్రి కాన్పూర్‌లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 
 
యూపీ రోడ్ వేస్‌కు చెందిన శతాబ్ది ఏసీ బస్సు లక్నో నుంచి ఢిల్లీ వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రయాణికులతో వెళ్తున్న మినీ బస్సు సచెంది వద్ద జేసీబీని ఢీకొని బ్రిడ్జి పైనుంచి కిందపడింది. 
 
సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలంలోనే పలువురు మరణించారు. క్షతగాత్రుల్లో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ప్రమాదం విషయం తెలిసి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. 
 
మరోవైపు, ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments