తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - 11 మంది మృతి

ఠాగూర్
ఆదివారం, 30 నవంబరు 2025 (20:23 IST)
తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం శివగంగ జిల్లాలోని తిరుపత్తూర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒక చిన్నారితో సహా 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే, ఒక బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడి వస్తుండగా... మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్‌కు ప్రయాణిస్తోంది. తిరుపత్తూర్ వద్దకు రాగానే ఈ రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను శివగంగ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
తమిళనాడులో వారం రోజుల వ్యవధిలోనే ఇలాంటి ఘోర ప్రమాదం జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నవంబరు 24వ తేదీన తెన్‌కాశి జిల్లాలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మహిళలు సహా ఆరుగురు మరణించగా, 56 మంది గాయపడిన విషయం తెల్సిందే. ఆ ప్రమాదానికి డ్రైవర్ అతివేగమే కారణమని పోలీసులు నిర్ధారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments