Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమా థియేటర్లలో మళ్లీ మాస్క్‌ రూల్!

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (16:27 IST)
తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్‌ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం కరోనా నిబంధనలను అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఇందులోభాగంగా, ఇప్పటికే ఆస్పత్రుల్లో మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఇపుడు సినిమా థియేటర్లలో కూడా ప్రేక్షకులు మాస్క్‌లు ధరించాలన్న నిబంధనను అమలు చేయాలని భావిస్తుంది. రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు వెల్లడించింది. థియేటర్లతో పాటు ఆస్పత్రులకు వెళ్లే రోగులు, రోగుల బంధువులు కూడా మాస్క్ ధరించాలని సూచించింది. 
 
కరోనా వ్యాప్తి పెరుగుతుండటంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ సెల్వ వినాయగం మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉందని తెలిపారు. అయితే, ముందు జాగ్రత్త చర్యగా వైరస్ వ్యాప్తని అడ్డుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రులు, థియేటర్లు, ఆడిటోరియాల్లో మాస్కులు ధరించాలని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments