Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్.బి.ఐలో 1031 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Webdunia
మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (15:51 IST)
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకులో 1031 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో చానల్ మేనేజర్ ఫెసిలేటర్, చానల్ మేనేజర్ సూపర్ వైజర్, సపోర్టు ఉద్యోగాలు ఉన్నాయి. అయితే, ఈ పోస్టులకు రిటైర్డ్ ఉద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రిటైర్డ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ విధానంలో ఎస్.బి.ఐ నియామకం చేపట్టనుంది. గతంలో బ్యాంకుల్లో పని చేసిన అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్ 30వ తేదీన చివరి తేదీగా ఖరారు చేసింది. 
 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి వయసు 60యేళ్ళు, గరిష్టంగా 63 యేళ్లకు మించకూడదు. రిజర్వేషన్లకు లోబడి వయసులో సడలింపు ఉంటుంది. దేశఁలో ఏ శాఖలో ఉద్యోగం కేటాయించినప్పటికీ అక్కడికి వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. ఏటీఎం ఆపరేషన్స్‌లో అనుభవం కలిగిన వారికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ పోస్టుల భర్తీని ఇంటర్వ్యూల ద్వారా చేపడుతారు. ఎంపికైన వారికి పోస్టులకు తగిన విధంగా రూ.36 వేల నుంచి రూ.41 వేల వరకు వేతనం చెల్లిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

బహుముఖ ప్రజ్నాశాలి శ్వేతప్రసాద్ కు బిస్మిలా ఖాన్ అవార్డు

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments