Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాత - అవ్వల వద్ద ఉంటున్న బాలికపై అత్యాచారం... మృతశిశువును జన్మించి మృతి

Webdunia
ఆదివారం, 20 జనవరి 2019 (11:03 IST)
తమిళనాడు రాష్ట్రంలోని పుదుక్కోట జిల్లాలోని ఊతంక్కరై పుదూర్ సమీపంలో 17 యేళ్ళ బాలికపై 27 యేళ్ళ యువకుడు పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారు. చివరకు ఆ బాలిక మృతశిశువుకు జన్మనిచ్చి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఊతంక్కరై పుదూర్ గ్రామానికి చెందిన 17 యేళ్ళ బాలిక స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటూ తాత - అవ్వల వద్ద నివశిస్తోంది. ఈ  బాలికపై అదే గ్రామానికి చెందిన 27 యేళ్ల యువకుడు ఒకడు కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. 
 
ఆ తర్వాత బాలికపై పదేపదే అత్యాచారం చేయసాగాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయాన్ని తాత అవ్వలకు తెలియకుండా ఆ బాలిక దాచిపెట్టింది. అయితే, ఆమె ఆరోగ్యం క్షీణించసాగడంతో మెరుగైన వైద్య చికిత్స కోసం సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు... బాలిక గర్భంతో ఉన్నట్టు తేల్చారు. ఆ తర్వాత ఆమెకు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ బాలిక మృతశిశువుకు జన్మనిచ్చి ప్రాణాలు విడిచింది. దీంతో మృతురాలి తల్లి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తమిళరసన్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kannappa: కన్నప్పకు కష్టాలు: కీలక సన్నివేశాల హార్డ్ డ్రైవ్ మిస్సింగ్.. కేసు నమోదు

Ramya: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా- నో చెప్తూ సీన్‌లోకి వచ్చిన నటి రమ్య

Prabhas: ప్రభాస్‌కు ఇటలీలో భారీ విలువ చేసే విల్లా- అద్దెకు ఇచ్చాడు.. రూ.40లక్షల సంపాదన

ఆస్కార్ నటులు - కమల్ హాసన్‌లు ఎక్కువైపోయారు.. వీళ్ళ నటన చూడలేకపోతున్నాం : బండ్ల గణేశ్ ట్వీట్

Dil Raju: పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఆపే దమ్ము ఎవరికీ లేదు- దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

నా ప్రాణమా, నన్నల్లుకునే పున్నమి సౌందర్యమా

తర్వాతి కథనం