Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మ, చిన్నమ్మ ఆస్తుల జప్తు.. చివరికి పోయెస్ గార్డెన్ కూడా?

తమిళనాడు సర్కారు దివంగత సీఎం జయలలిత, శశికళకు చెందిన ఆస్తులను న్యాయస్థానం అనుమతితో జప్తునకు ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో జయమ్మ ఆస్తులు స్వాధీనం చేసుకుని వాటి విలువ లెక్కించాలని.. ఆపై వేలం వేయాలని తమ

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (12:31 IST)
తమిళనాడు సర్కారు దివంగత సీఎం జయలలిత, శశికళకు చెందిన ఆస్తులను న్యాయస్థానం అనుమతితో జప్తునకు ఆదేశించింది. అక్రమాస్తుల కేసులో జయమ్మ ఆస్తులు స్వాధీనం చేసుకుని వాటి విలువ లెక్కించాలని.. ఆపై వేలం వేయాలని తమిళ సర్కారు నిర్ణయించింది. జయలలితతో పాటూ శశికళ, ఇళవరసి, జయ మాజీ దత్తపుత్రుడు సుధాకరన్ ఆస్తులు కూడా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది 
 
ఇంకా జయలలిత చివరి రోజులు గడిపిన పోయెస్ గార్డెన్ నివాసాన్ని కూడా జప్తు చేయనున్నట్లు తెలిసింది. మొన్నటి వరకు దానికి జయ స్మారక భవనంగా మారుస్తామని చెప్పుకొచ్చారు. అయితే తమిళ సర్కారు ఆ విషయాన్ని మరిచిపోయినట్లు కనిపిస్తోంది. అన్ని ఆస్తుల తరహాలోనే పోయెస్ గార్డెన్‌ను కూడా జప్తు చేయాలని పళని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. తమిళ సర్కారు ఆదేశాలతో రెవెన్యూ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులు జయ, శశి ఆస్తుల జప్తులో బిజీగా ఉన్నారు. 
 
కాగా.. ఏప్రిల్ 2016 నాటికి జయలలిత నివాసం పోయెస్ గార్డెన్‌ విలువ రూ.72.1 కోట్లుగా ఉన్నదని.. ఇతర జయమ్మ ఆస్తులు రూ.23.2 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. హైదరాబాదులో 1.14. కోట్లు, చెయ్యూరులో రూ.34 లక్షల విలువ చేసే ఆస్తులుండగా, పెట్టుబడుల కింద రూ. 21.5 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంకా కొడనాడు ఎస్టేట్ రూ. 3.13 కోట్లు, జయ పబ్లికేషన్స్‌లో రూ.40.4 లక్షలు వంటి ఇతరత్రా ఆస్తుల విలువ భారీగానే ఉన్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకే చోటు ప్రత్యక్షమైన ధనుష్ - నయనతార - ముఖాలు చూసుకోని హీరోహీరోయిన్లు

ఇడ్లీ కడై నిర్మాతకు పెళ్లి.. ఒకే వేదికపై నయన, ధనుష్.. మాట్లాడుకున్నారా?

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments