Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీకటి గదిలో ఒకరి తర్వాత ఒకరు.. 3వేల మంది నరకం చూపించారు: నదియా మురాద్

ఐఎస్ ఉగ్రవాదుల చెర అనేకమంది మహిళలు బందీలుగా ఉన్నారు. మహిళలను ఐఎస్ ఉగ్రవాదులు సెక్స్ బానిసలుగా మార్చేస్తున్నారు. ఈ క్రమంలో తాను బందీగా ఐఎస్ ఉగ్రవాదులకు పట్టబడిన ప్రాంతానికి వెళ్లిన మహిళ భావోద్వేగానికి

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (11:27 IST)
ఐఎస్ ఉగ్రవాదుల చెర అనేకమంది మహిళలు బందీలుగా ఉన్నారు. మహిళలను ఐఎస్ ఉగ్రవాదులు సెక్స్ బానిసలుగా మార్చేస్తున్నారు. ఈ క్రమంలో తాను బందీగా ఐఎస్ ఉగ్రవాదులకు పట్టబడిన ప్రాంతానికి వెళ్లిన మహిళ భావోద్వేగానికి గురైంది. ఆమె ఎవరో కాదు.. ఐఎస్ టెర్రరిస్టుల లైంగిక జీవన విధానాన్ని.. వారు మహిళలకు నరకం చూపించిన విధానాన్ని ప్రపంచానికి తెలిసే చేసిన ఇరాక్ మహిళ నదియా మురాద్. 
 
ప్రస్తుతం ఐరాసలో యాజిదీలు, శరణార్థులు, మహిళల హక్కులపై పోరాడే లాయర్‌‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా నదియా ఇరాక్‌లోని యాజాది గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామంలో మూడేళ్ల క్రితం చోటుచేసుకున్న దురాగతాన్ని అంతర్జాతీయ మీడియాకు వివరించారు. 2014లో తమ గ్రామాన్ని ఐసిస్ ఉగ్రవాదులు చుట్టుముట్టారని.. కొన్ని నిమిషాల్లోనే మగవారిని, ఆడవారిని వేరు చేశారన్నారు. పురుషుల్ని కళ్ల ముందు కాల్చి చంపేశారు. కానీ మహిళల్ని చంపేస్తారనుకుంటే.. ఆ రాక్షసులు ఆ పనిచేయలేదు. 
 
తమలోని యువతులను ఇరాక్‌లోని మొసూల్‌ తీసుకెళ్లి వేలం వేశారని నదియా మురాద తెలిపింది. అప్పటికే వారి చేతుల్లో నలిగిపోయామని.. ఆ తర్వాత సిరియన్లు, యూరోపియన్లు, ఇరాకీయులు వారి కామవాంఛలను తీర్చుకునేందుకు తమను వాడుకున్నారని తెలిపింది.

చీకటి గదుల్లో ఒకరి తరువాత ఒకరుగా తమపై అత్యాచారాలకు పాల్పడేవాళ్లు. నరకం చూపించే వాళ్లు. ఇలా మూడువేల మందికిపైగా యాజాదీ మహిళలను సెక్స్ బానిసలుగా మార్చేసుకున్నారు. అదృష్టవశాత్తూ 2014 నవంబరులో అక్కడి నుంచి తప్పించుకోగలిగానని యూజాదీ మురార్ కన్నీటి పర్యంతం అయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం