Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ వివాహిత - ఓ యువతి.. గాఢ ప్రేమికులు... చివరకు...

Webdunia
బుధవారం, 20 మే 2020 (13:36 IST)
ఓ యువతికి వివాహమై భర్త ఉన్నాడు. కానీ, కొన్ని నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. ఈ మహిళకు చిన్నప్పటి నుంచి ఓ స్నేహితురాలువుంది. వీరిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరిపై ఒకరికి వల్లమాలిన ప్రేమ. ఆ ప్రేమే వారిద్దరినీ లెస్బియన్స్‌గా మార్చింది. ఈ క్రమంలో ఓ యువతికి తల్లిదండ్రులు పెళ్లి చేశారు. కానీ, ఆమె ధ్యాసంతా తోటి స్నేహితురాలిపైనే. 
 
అందుకే, భర్త వద్ద సంసార జీవితం కొనసాగించలేక వదిలిపెట్టి పుట్టింటికి వచ్చింది. దీనిపై ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వివాహితకు తన స్నేహితురాలితో లైగింక సంబంధం ఉన్నట్టు తేలింది. అంటే... లెస్బియన్స్‌గా ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అయితే, వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ, పెద్దలు అంగీకరించకపోవడంతో వారిద్దరూ విగతజీవులయ్యారు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నామక్కల్ పట్టణానికి చెందిన 23 యేళ్ళు, 20 యేళ్ళ యువతులు ఉన్నారు. వీరిద్దరూ పెరియ మనాలిలో ఉన్న ఓ మగ్గం పరిశ్రమలో పని చేస్తూ, మంచి స్నేహితురాళ్ళుగా ఉంటూవచ్చారు. ఈ సంబంధం కాస్త లైంగిక బంధానికిదారితీసింది. 
 
ఈ క్రమంలో ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లిచేశారు. వారికి రెండేళ్ళ కుమారుడు కూడా ఉన్నాడు. ఆ తర్వాత భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా పుట్టింటికి వచ్చేసింది. 
 
ఆ తర్వాత స్నేహితురాలిని తరచూ కలుస్తూవుండేది. వీరి బంధం గురించి యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో వివాహితతో దూరంగా ఉండాలని ఆమెను హెచ్చరించారు. అంతేకాదు, రాశిపురానికి చెందిన వ్యక్తితో యువతికి మే 27న పెళ్లి చేయాలని నిర్ణయించారు. 
 
గత శనివారం, యువతి ఆ వివాహిత ఇంటికి ఉదయం 11 గంటలకు వెళ్లి కలిసింది. సాయంత్రం 3 గంటలకు ఆ వివాహిత సోదరుడు గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని కనిపించారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని, మృతదేహాలను పోస్ట్‌మార్టానికి తరలించామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం