Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిప్రమాదం జరిగిన రైలు బోగీలో కాలిన నోట్ల కట్టలు

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (09:59 IST)
మదురై రైల్వే స్టేషన్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ రైలు బోగీ పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది యాత్రికులు సజీవ దహనమయ్యారు. అయితే, ఈ బోగీని క్షుణ్ణంగా గాలించగా, సగం కాలిపోయిన నోట్ల కట్టలను విచారణ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తమ దారి ఖర్చుల కోసం యాత్రికులు ఈ డబ్బులు తెచ్చుకుని ఉంటారని భావిస్తున్నారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 62 మంది భక్తులు ప్రైవేటు పార్టీ ఆధ్వర్యంలో రామేశ్వరం వరకు ఆధ్యాత్మిక పర్యటన కోసం వచ్చారు. వీరంతా కలిసి ఓ రైలు బోగీని మాట్లాడుకుని, అందులో వచ్చారు. అయితే, ఈ రైలు బోగీని మదురై స్టేషన్‌లో ఆపి వుంచగా అక్రమంగా బోగీలోకి తీసుకొచ్చిన గ్యాస్ సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
శనివారం తెల్లవారుజామున దగ్ధమైన ఘటనపై విచారణ జరుగుతోంది. ఆదివారం ఫోరెన్సిక్ నిపుణులు కోచ్‌లో తనిఖీలు చేసారు. ఓ పెట్టెలో సగం కాలిన నోట్లు భారీగా బయటపడ్డాయి. రూ.200, రూ.500 నోట్లు అందులో ఉన్నట్లు గుర్తించారు. యాత్రికుల కోసం దారిలో ఖర్చులకు ట్రావెల్ ఏజెన్సీ వారు తెచ్చుకున్నట్లు భావిస్తున్నారు. 
 
మొత్తం 63 మంది ప్రయాణికులు లక్నో నుంచి ప్రత్యేక కోచ్‌లో తమిళనాడుకు వచ్చారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు మాయమైనట్లు గుర్తించారు. వారికోసం ఆదివారం ప్రత్యేక బలగాలతో తనిఖీలు చేపట్టారు. చివరికి వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంతో వారికేమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. దక్షిణ సర్కిల్ కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ ఏఎం చౌదరి ఘటనాస్థలిలో విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments