Webdunia - Bharat's app for daily news and videos

Install App

శవానికి మూడు రోజులు చికిత్స చేసిన ఆస్పత్రి వైద్యులు... ఎక్కడ?

తమిళనాడు రాష్ట్రంలోని ఓ ఆస్పత్రి ప్రాణాలు కోల్పోయిన ఓ మృతదేహానికి మూడు రోజుల పాటు చికిత్స చేశారు. ఇది అచ్చం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలోని ఆసుపత్రి సన్నివేశాన్ని తలపించింది.

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (12:01 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఓ ఆస్పత్రి ప్రాణాలు కోల్పోయిన ఓ మృతదేహానికి మూడు రోజుల పాటు చికిత్స చేశారు. ఇది అచ్చం మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాలోని ఆసుపత్రి సన్నివేశాన్ని తలపించింది. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
తమిళనాడు నాగపట్టణం జిల్లాలోని తంజావూర్ ఆసుపత్రిలో ఎన్.శేఖర్ (55) అనే వ్యక్తి చనిపోయాడు. అయినప్పటికీ ఆయనకు మూడు రోజుల పాటు చనిపోయాడు. మూడు రోజుల పాటు వైద్యులు చికిత్స చేశారు. దీనిపై స్పందిస్తూ, మృతుని కుమారుడు స్పందిస్తూ, తన తండ్రి చనిపోయి మూడు రోజులైంది. ఆస్పత్రి వైద్యులు మాత్రం చనిపోయినట్టుగా చెప్పలేదు. పైగా, తన తండ్రి ఆరోగ్యం గురించి అడిగితే ఇంకా వైద్యం చేస్తూనే ఉన్నామని బదులిచ్చారని ఆయన కుమారుడు సుభాష్ తెలిపారు.
 
సుభాష్ కథనం ప్రకారం.. సెప్టెంబరు 9న శేఖర్ కడుపునొప్పితో నాగపట్టణంలోని ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు అక్కడి నుంచి తంజావూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి రెఫర్ చేశారు. సెప్టెంబరు 10న శేఖర్‌ను అక్కడికి తరలించారు. ఆసుపత్రి యాజమాన్యం తొలుత రూ.5 లక్షలు కట్టించుకుంది. చికిత్స కొనసాగించేందుకు మరో రూ.3 లక్షలు చెల్లించాల్సిందిగా శుక్రవారం బాధిత కుటుంబాన్ని కోరింది.
 
ఇక తమ వద్ద డబ్బు లేకపోవడంతో, శేఖర్‌ను తంజావూర్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు ఆయన చనిపోయి మూడు రోజులు అయిందని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. దీంతో శుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
ఆసుపత్రి యాజమాన్యం తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శేఖర్ మృతి చెందిన విషయాన్ని చెప్పాల్సింది పోయి ఇంకా ఫీజు అడగడం దారుణమని సీపీఐ ఎమ్మెల్యే జి.పళనిస్వామి అన్నారు. కాగా, పోస్టుమార్టం రిపోర్టు కోసం వేచి చూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శేఖర్ మూడు రోజుల క్రితమే మరణించినట్టు పోస్టుమార్టంలో తేలితే ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళలందరికీ డియర్ ఉమ విజయం అంకితం : సుమయ రెడ్డి

జాత‌కాల‌న్ని మూఢ‌న‌మ్మ‌కాలు న‌మ్మేవాళ్లంద‌రూ ద‌ద్ద‌మ్మ‌లు... ఇంద్రగంటి మోహన్ కృష్ణ

బుధవారం లోగా బ్రేక్ ఈవెన్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పడం హ్యాపీగా వుంది : కళ్యాణ్ రామ్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments