Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీతో పెళ్లి.. నెలరోజులకే టెన్త్ విద్యార్థితో ప్రైవేట్ టీచర్ లేచిపోయింది

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (11:02 IST)
ఆమె ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వయసు 26 యేళ్లు. ఆమె వద్ద 15 యేళ్ల వయసున్న విద్యార్థి పదో తరగతి చదువుతున్నారు. అతనిపై టీచరమ్మ మనసు పారేసుకుంది. అయితే, ఈ విషయం ఆ విద్యార్థి, టీచరమ్మకు మాత్రమే తెలుసు. 
 
ఈ క్రమంలో టీచర్‌కు గతనెల 19వ తేదీన చెన్నైలోని ఓ ఐటీ కంపెనీలో పని చేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో వివాహం జరిపించారు. కానీ, తన మనసిచ్చిన విద్యార్థిని మాత్రం మరిచిపోలేక పోయింది. దీంతో నెల తిరగక ముందే బాలుడితో లేచిపోయింది. ఆపై పోలీసులను ఆశ్రయించి, తామిద్దరం కలిసే ఉంటామని చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. 
 
తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లా తిరువాగౌండనూరుకు చెందిన ఈ టీచరమ్మ... వివాహం తర్వాత తన పుట్టింటికని వెళ్లింది. భర్త మాత్రం ఉద్యోగ నిమిత్తం చెన్నైకు వచ్చాడు. ఈ క్రమంలో ఉపాధి కల్పనా కార్యాలయానికి వెళ్లివస్తానని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. 
 
సాయంత్రం వరకు రాకపోవడంతో పలుచోట్ల గాలించిన తల్లిదండ్రులు.. చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఆ సమయంలోనే ఆ టీచరమ్మ తాను ప్రేమించిన బాలుడుతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. తామిద్దరం కలిసే ఉంటామని, అతన్ని వదిలిపెట్టలేనని తెగేసి చెప్పింది. ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసుల తలలు పట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments