Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించలేదనీ ఇంజనీరింగ్ విద్యార్థినిని దుడ్డుకర్రతో కొట్టిచంపిన మాజీ విద్యార్థి

తమిళనాడు రాష్ట్రంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదన్న కోపంతో తరగతి గదిలోనే ఓ విద్యార్థినిని మాజీ విద్యార్థి కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన కరూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగి

Webdunia
బుధవారం, 31 ఆగస్టు 2016 (10:33 IST)
తమిళనాడు రాష్ట్రంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ప్రేమించలేదన్న కోపంతో తరగతి గదిలోనే ఓ విద్యార్థినిని మాజీ విద్యార్థి కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన కరూర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కరూర్‌లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో శివగంగై జిల్లా మానామదురైకు చెందిన సోనాలి మూడో సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది. మంగళవారం ఉదయం 11 గంటలకు తరగతి గదిలో ప్రొఫెసర్ చెప్పే పాఠాలను వింటూ కూర్చుంది. ఈసమయంలో హఠాత్తుగా తరగతి గతిలోకి ప్రవేశించిన ఓ యువకుడు చేతిలో ఉన్న దుడ్డుకర్రతో ఆమె తలపై బలంగా కొట్టాడు. 
 
దీంతో ఆ విద్యార్థిని రక్తపు మడుగులో పడిపోయింది. ఆ తర్వాత సోనాలిని సహచర విద్యార్థులు, కళాశాల సిబ్బంది స్థానికంగా ఉన్న సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మదురైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఉదయకుమార్ అనే యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఉదయకుమార్ కళాశాల నుంచి సస్పెండ్ అయినట్టు తేలింది.
 
సోనాలి తండ్రి నాలుగు నెలల క్రితం మరణించాడు. ఆమె తల్లి చెన్నైలో ఓ చిన్న సంస్థలో పని చేస్తూ తన కుమార్తెను చదివిస్తున్నట్టు విచారణలో తేలింది. తన ప్రేమను తిరస్కరించడంతో వల్లే ఉదయకుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం ఇదేతరహాలో చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకు గురైన విషయం తెల్సిందే. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments