Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుప్పూర్‌లో పరువు హత్య.. కన్నకూతురిని పెట్రోల్ పోసి తగలబెట్టేశారు..

సెల్వి
గురువారం, 11 జనవరి 2024 (19:54 IST)
ఆధునికత పెరిగినా పరువు హత్యలు మాత్రం తగ్గట్లేదు. కులం పేరిట ఓ ప్రేమ విషాదాన్ని మిగిల్చింది. తక్కువ కులం యువకుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో కన్న కూతురిని హత్య చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తమ పరువు తీసిందనే కోపంతో కన్న తల్లిదండ్రులే కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించి మరి హత్య చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. తంజావూరు జిల్లాలోని పూవలూరుకు చెందిన నవీన్(19) ఐశ్వర్య(19)లు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఉద్యోగం చేస్తూ సహజీవనం చేసిన ఈ ఇద్దరు వివాహం కోసం పెద్దలను ఒప్పించాలనుకున్నారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ 31వ తేదీన పెళ్లి చేసుకున్నారు. 
 
అయితే ఐశ్వర్య తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐశ్వర్యను తన తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో ఇంటికి తీసుకెళ్లిన వారు… వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని పరువుతీస్తావా అంటూ పెట్రోల్ పోసి నిప్పటించి అతి దారుణంగా హత్య చేశారు. 
 
ప్రేమికుడి ఫిర్యాదు మేరకు ఈ హత్య కేసులో ఐశ్వర్య తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారించిన న్యాయస్థానం నిందితులను 15 రోజల కస్టడికి అనుమతించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి పిలిస్తేనే వచ్చాను.. పార్టీలో కలిశాను.. ఇషా

Kiran Abbavaram: తండ్రి అయిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. రహస్యకు బాబు

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments