Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 21 వరకు తమిళనాడులో లాక్ డౌన్ కొనసాగింపు

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (20:06 IST)
తమిళనాడులో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 21 వరకూ పొడిగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందు, జూన్ 5న నిత్యావసరాల దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి పనిచేందుకు ముఖ్యమంత్రి స్టాలిన్ అనుమతించారు. జూన్ 14 వరకూ లాక్‌డౌన్ పొడిగించారు. మొత్తంగా తమిళనాడులో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ కోయంబత్తూరు, నీలగిరితో సహా 11 జిల్లాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల కొనసాగుతోంది. 
 
ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ కాలంలో మరిన్ని ఆంక్షలు సడలించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, ప్రభుత్వం నడిపే మద్యం దుకాణాలను రాష్ట్రంలోని 27 జిల్లాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అనుమతిస్తారు.
 
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ప్రొవిజన్ స్టోర్లు, కూరగాయల దుకాణాలు, మాంసం, చేపల దుకాణాలు, పూలమ్ముకునే పేవ్‌మెంట్ హాకర్లును అనుమతిస్తున్నారు.
 
చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలను ఎయిర్ కండిషన్లు లేకుండా 50 శాతం కస్టమర్లతో సాయంత్రం 5 గంటలకు వరకూ అనుతిస్తామని తాజా ఉత్తర్వు పేర్కొంది. ప్రభుత్వ పార్కులు ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ తెరుస్తారు. టాక్సీలు, ఆటోలు నడుస్తాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments