Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్ విద్యార్థితో టీచరమ్మ ప్రేమ - పెళ్లి .. ఎక్కడ?

Webdunia
బుధవారం, 29 డిశెంబరు 2021 (09:02 IST)
తన వద్దకు వచ్చే విద్యార్థులకు నాలుగు మంచి మాటలతో పాటు పాఠాలు బోధించాల్సిన ఓ టీచరమ్మ 17 యేళ్ల బాలుడుతో ప్రేమలోపడింది. అలా కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత చివరకు ఆ విద్యార్థితో లేచిపోయి రహస్యంగా పెళ్లి చేసుకుంది. దీంతో బాలుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పారిపోయిన ప్రేమికులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మైనర్ ప్రియుడితో లేచిపోయినందుకు టీచరమ్మపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని అరియలూరు జిల్లా పళవరాయనల్లూరులో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామానికి చెందిన 17 యేళ్ల బాలుడు స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇదే పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసే అంబాపూరుకు చెందిన 24 యేళ్ల టీచరమ్మ ఈ బాలుడుపై మనసుపడింది. ఆ తర్వాత గత అక్టోబరులో రహస్యంగా వివాహం చేసుకున్నారు. 
 
ఈ విషయం తెలిసిన ఇరు కుటుంబాల సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఆ ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఇరుగుపొరుగువారు గమనించి ఆస్పత్రిలో చేర్పించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, బాలుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో టీచరమ్మపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments