Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్నీరును టార్గెట్ చేసిన పళని.. అవినీతి చిట్టా విప్పమని ఆదేశాలు..

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో ఈమె జైలు జీవనం గడుపుతుంటే.. తాజాగా ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా ఈసీకి లంచం ఇవ్వజూపారని పోలీసుల అ

Webdunia
బుధవారం, 3 మే 2017 (09:20 IST)
దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అక్రమాస్తుల కేసులో ఈమె జైలు జీవనం గడుపుతుంటే.. తాజాగా ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ కూడా ఈసీకి లంచం ఇవ్వజూపారని పోలీసుల అదుపులో ఉన్నారు. దీంతో శశికళ కుటుంబాన్ని అన్నాడీఎంకే దూరం చేయాలని మాజీ సీఎం ఓపీఎస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మాత్రం చిన్నమ్మను వదిలేది లేదని తేల్చేసినట్లు సమాచారం. దీంతో ఓపీఎస్-పళని సామి వర్గాల విలీనం ఇక లేదని దాదాపు ఖాయమైపోయింది. 
 
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మాజీ సీఎం పన్నీర్ సెల్వం అవినీతి చిట్టాను విప్పాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల పళనిస్వామి మాట్లాడుతూ తమ సత్తా ఏంటో, తమకు ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు ఉన్నారో చెబుతూ విలీనం ప్రసక్తే లేదని చెప్పకనే చెప్పారు. ఇంకా ఓపీఎస్‌ అవినీతి ఏంటో బయటకు తీయాలని ఆదేశాలు జారీ చేయడం తమిళనాట కలకలం రేపుతోంది. 
 
ఆర్థికమంత్రిగా పన్నీర్ సెల్వం ఆరేళ్ల కాలంలో చేసిన అవినీతి జాబితాను బయటకు తీసి సిద్ధం చేయాల్సిందిగా సీఎం ఆదేశించారు. మే 5వ తేదీ నుంచి పన్నీర్ రాష్ట్ర పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో ఆయన అవినీతి రికార్డును బయటపెట్టాలని చెప్పడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments