Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ పసికూనలు డీఎంకేను తుడిచిపెట్టలేరు : సీఎం ఎంకే స్టాలిన్

ఠాగూర్
మంగళవారం, 5 నవంబరు 2024 (14:17 IST)
ఇటీవల రాజకీయ పార్టీని స్థాపించిన తమిళ అగ్ర హీరో విజయ్‌ను లక్ష్యంగా చేసుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొత్తగా రాజకీయాల్లో వచ్చే పసికూనలు డీఎంకేను తుడిచిపెట్టలేరన్నారు. పైగా, ఇలాంటివారి డీఎంకే ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. 
 
విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి రాజకీయ మహానాడును ఇటీవల విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెల్సిందే. ఈ మహానాడులో విజయ్ చేసిన ప్రసంగంలో డీఎంకేపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 
 
డీఎంకే పార్టీని తమ రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తామని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ స్పందించారు. విజయ్ పేరెత్తకుండా, విమర్శనాస్త్రాలు సంధించారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన వారు కూడా డీఎంకే పార్టీ తుడిచిపెట్టుకుపోవాలంటున్నారని తెలిపారు. 
 
ఇలాంటి రాజకీయ పసికూనలు చేసే వ్యాఖ్యలను డీఎంకే పట్టించుకోబోదని స్పష్టం చేశారు. 'వారికి ఇదే నా హృదయపూర్వక విజ్ఞప్తి... ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని చూడండి. మేం విజయవంతంగా త్వరలోనే నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. 
 
ఈ సందర్భంగా సీఎ అన్నాదురై మాటలను ఓసారి స్మరించుకుందాం. 'విరోధులారా వర్థిల్లండి' అని అన్నాదురై నాడు చేసిన వ్యాఖ్యలే మాకు స్ఫూర్తి. ఇంతకంటే ఎక్కువగా స్పందించలేను. ఎవరో ఏదో అంటే నేను అస్సలు పట్టించుకోను. 
 
ప్రజలకు సేవ చేయడంపైనే మా ప్రధాన దృష్టి. విమర్శించే వారందరికీ సమాధానం చెబుతూ పోవడం కుదరదు... టైమ్ వేస్ట్ తప్ప మరే ప్రయోజనం లేదు. మాకు ఉన్న సమయం అంతా ప్రజా సేవ కోసమే వినియోగిస్తాం. ప్రజలు ఏ నమ్మకంతో మమ్మల్ని గత ఎన్నికలప్పుడు గెలిపించారో, అదే నమ్మకంతో మేం ప్రజాపాలనకు కట్టుబడి ఉన్నాం' అని స్టాలిన్ వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments